Best Education Loan Banks : ప్రస్తుత కాలంలో ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. నాణ్యమైన చదువు కోసం లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. తమ లాగా బిడ్డలు కష్టపడొద్దని తల్లిదండ్రులు పిల్లల ఉన్నత చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. అయితే.. ఎంత చేసినా విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే భారీగా ఖర్చవుతుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Which Banks Better for Educational Loans in India :ఇలాంటి సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అందించే విద్యా రుణాలు ఒకింత ఊరట కలిగించే విషయం. అలాగే.. సెక్షన్ 80(E) కింద విద్యా రుణాలు పొందడం ద్వారా ఆదాయ పన్ను మినహాయింపుతోపాటు పలు ప్రయోజనాలూ ఉండటంతో చాలా మంది ఎడ్యుకేషన్ లోన్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. బ్యాంకులు అంత సులువుగా ఈ లోన్లు మంజూరు చేయడం లేదు. ష్యూరిటీ అడుగుతున్నాయి. అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎడ్యూకేషనల్ లోన్స్ తీసుకుంటే మంచిదా? లేదా ప్రైవేట్ రంగ బ్యాంకు(Private Banks)ల్లో విద్యా రుణాలు తీసుకుంటే బెటర్‌గా ఉంటుందా? అనే సందేహం వస్తోంది. మరి, ఏ బ్యాంకుల్లో విద్యా రుణం తీసుకుంటే తక్కువ వడ్డీరేటుతో లబ్ధి చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లోన్ ఎవరికి ఇస్తారు?
Which Courses Eligible for Educational Loans :ఎడ్యుకేషన్ లోన్ పొందడానికి అభ్యర్థి ముందుగా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన వారికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. చాలా బ్యాంకులు సాధారణంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు అందించే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో దీర్ఘకాలిక ఉద్యోగ ఆధారిత వృత్తిపరమైన, సాంకేతిక కోర్సులకు విద్యా రుణాలను మంజూరు చేస్తూ ఉంటాయి. UGC/AICTE లేదా ప్రభుత్వం గుర్తించిన చాలా దేశీయ కోర్సులకు బ్యాంకులు సాధారణంగా రుణాలను అందిస్తాయి. అలాగే.. బాగా మంచి పేరున్న యూనివర్సిటీల్లో సీటు లభిస్తే ఆ విద్యార్థులకు త్వరగానే లోన్ లభించే ఛాన్స్ ఉంటుంది.
ఈ కోర్సులకు లోన్స్ ఇవ్వడం కష్టం :సంప్రదాయేతర కోర్సులైన సంగీతం, ఫైన్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, థియేటర్ వంటి నాన్ టెక్నికల్ కోర్సులు తీసుకున్న వారికి, అలాగే సాంఘిక శాస్త్రాలు అభ్యసించాలని అనుకునే వారికి మాత్రం విద్యారుణాలు లభించడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇలాంటి కోర్సులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్లు ఇవ్వడం చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రైవేట్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇలాంటి సంప్రదాయేతర కోర్సులకు లోనులు ఇస్తాయి. కానీ అధిక వడ్డీలు వసూలు చేస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి.
Education Loan For Abroad Studies : ఎడ్యుకేషన్ లోన్ కావాలా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
ఎంత లోన్ వస్తుంది?
విద్యార్థులకు ఇచ్చే ఎడ్యూకేషన్ లోన్స్ ఎంత మొత్తం వరకు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక పరిమితి ఉంటుంది. కానీ అదే ప్రైవేట్ బ్యాంకులు లోన్ తీసుకునే విద్యార్థుల కాలేజ్-కోర్స్ కాంబినేషన్ చూసుకుంటాయి. అదే విధంగా విద్యార్థికి ఆ కోర్సులు చేయడం వల్ల భవిష్యత్‌లో ఎంత మేరకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయో కూడా అంచనా వేస్తాయి. వాటి ఆధారంగానే విద్యారుణాలు ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ మొత్తంలో మంజూరు చేస్తూ ఉంటాయి.
లోన్ అందుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. కానీ ఈ బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం అంత సులభమైన పని కాదు. విద్యా రుణం పొందడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో విద్యారుణాలు చాలా త్వరగానే లభిస్తాయి. కానీ వడ్డీ రేట్లు మాత్రం కాస్త ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
Education Loan Tips : మీ విద్యా రుణం త్వరగా తీర్చేయాలా?.. ఈ టిప్స్ పాటించండి!