తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎడ్యుకేషన్​ లోన్​కు ఏ బ్యాంక్ బెస్ట్? ప్రభుత్వ బ్యాంక్​నా లేక ప్రైవేటుదా? - best education loan bank in india

Best education loan in India : ఉన్నత విద్య ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో విద్యారుణాలు విద్యార్థులకు ఒక వరంగా మారాయి. మరి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణం తీసుకోవాలా? లేదా ప్రైవేట్​ బ్యాంకుల్లో రుణం తీసుకోవాలా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Education loan from Private and PSU banks
education loan form Banks

By

Published : Jun 4, 2023, 1:35 PM IST

Best education loan bank in India: నేటి కాలంలో ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. అందువల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉన్నతమైన చదువుల కోసం కచ్చితంగా బ్యాంకుల నుంచి లోన్​ తీసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. దేశంలోనే చదువు కొనసాగితే కొంత మేరకు సొంత సొమ్మును సర్దుకోవచ్చు. అదే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే అది తలకు మించిన భారమే. ఇలాంటి సందర్భాల్లోనే బ్యాంకు లోన్​లు సామాన్యులకు వరంలా కనిపిస్తాయి.

ప్రభుత్వరంగ బ్యాంకులు సాధారణంగా తక్కువ వడ్డీకే విద్యా రుణాలు అందిస్తూ ఉంటాయి. కానీ ఈ బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం అంత సులభమేమీ కాదు. చాలా ప్రాసెస్​ ఉంటుంది. చాలా సమయం కూడా పడుతుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో విద్యారుణాలు చాలా త్వరగానే లభిస్తాయి. కానీ వడ్డీ రేట్లు మాత్రం కాస్త అధికంగానే ఉంటాయి.

ఏఏ కోర్సులకు విద్యారుణాలు లభిస్తాయి?
చాలా వరకు బ్యాంకులు దీర్ఘకాలిక ప్రొఫెషనల్​ కోర్సులకు, టెక్నికల్​ కోర్సులకు రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. విద్యార్థులకు బాగా మంచి పేరున్న యూనివర్సిటీల్లో సీటు లభిస్తే, త్వరగానే లోన్​ లభించే అవకాశం ఉంటుంది.

సంప్రదాయేతర కోర్సులైన ఫైన్​ ఆర్ట్స్​, సంగీతం లాంటి కోర్సులు తీసుకున్న వారికి, అలాగే సాంఘిక శాస్త్రాలు అభ్యసించాలని అనుకునే వారికి మాత్రం విద్యారుణాలు లభించడం అంత సులభం కాదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటి కోర్సులకు లోన్​లు ఇవ్వడం చాలా అరుదు. ప్రైవేట్​ బ్యాంకులు, నాన్​-బ్యాంకింగ్​ ఫైనాన్స్​ కంపెనీలు ఇలాంటి సంప్రదాయేతర కోర్సులకు లోనులు ఇస్తాయి. కానీ అధిక వడ్డీలు వసూలు చేస్తాయి.

ఎంత మొత్తం మేర లోన్​ దొరుకుతుంది?
ప్రభుత్వరంగ బ్యాంకులకు లోన్ అమౌంట్​ ఎంత మేరకు ఇవ్వాలనే విషయంలో ఒక పరిమితి ఉంటుంది. కానీ ప్రైవేట్​ బ్యాంకులు కాలేజ్​-కోర్స్​ కాంబినేషన్​ చూసుకుంటాయి. అలాగే ఆ కోర్సులు చేయడం వల్ల విద్యార్థికి భవిష్యత్​లో ఎంత మేరకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయో కూడా అంచనా వేస్తాయి. వాటి ఆధారంగా ఎక్కువ మొత్తంలో విద్యా రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి.

విద్యా రుణంపై వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
Education loan interest rate : ప్రైవేట్​ బ్యాంకులతో పోలిస్తే సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వడ్డీ రేటు.. రుణం తీసుకుంటున్నవారి ఆర్థిక స్థితిగతులపైన, వారి క్రెడిట్​ స్కోర్​పైన, కోర్స్​ తీసుకున్న విద్యా సంస్థ పేరు, ప్రఖ్యాతులపైన ఆధారపడి ఉంటుంది. వీటికి తోడు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్​ ఫీజు కూడా వసూలు చేస్తాయి.

ప్రభుత్వ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
ప్రస్తుతం ఎస్​బీఐ విద్యారుణాలపై 8.2 శాతం వరకు, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 8.85 శాతం వరకు, పంజాబ్​ నేషనల్ బ్యాంక్ 8.55 శాతం వరకు ​వసూలు చేస్తున్నాయి. ఇవి ప్రారంభ వడ్డీ రేట్లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకుంటే ఇంకా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
విద్యారుణాలపై వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంకు 9.85 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు 9.55 శాతం, యాక్సిస్​ బ్యాంకు 13.7 శాతం మేరకు వసూలు చేస్తున్నాయి. కోర్స్​, విద్యాసంస్థ, ఉద్యోగ అవకాశాలు మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకుని ఈ వడ్డీ రేట్లలో మార్పులు కూడా ఉండాయని రుణగ్రహీతలు గుర్తుంచుకోవాలి.

పూచీకత్తు చూపించాల్సి ఉంటుందా?
collateral requirements : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిర్దిష్ట మొత్తం కంటే అధిక మొత్తం రుణాలు పొందాలంటే పూచీకత్తు చూపించాలి. అందుకోసం మన ఆస్తులను ఆ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రైవేట్ బ్యాంకులు చాలా వరకు ఇలాంటి తాకట్టులు అడగవు. మరో విషయం ఏమిటంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద రుణం తీసుకోవాలంటే రుణగ్రహీత మార్జిన్​ మనీని చూపించాలి. సాధారణంగా ప్రైవేట్ బ్యాంకులు ఈ మార్జిన్ ​మనీని అడగవు.

రుణాలు ఎంత కాలంలోపు తీర్చాల్సి ఉంటుంది?
ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణాలు తీర్చడానికి మారటోరియం పీరియడ్, గ్రేస్​ పీరియడ్​ ఇస్తుంటాయి. అంటే ఈ కాలంలో ప్రత్యేకం రుణగ్రహీత అదనపు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రైవేట్​ బ్యాంకులు మాత్రం మారటోరియం సమయంలోనూ కొంత మేరకు లేదా పూర్తి స్థాయిలో వడ్డీని వసూలు చేస్తూ ఉంటాయి.

తీసుకున్న రుణాలు ముందుగా చెల్లించాలనుకుంటే ప్రైవేట్​ బ్యాంకు అందుకు కూడా ముందస్తు చెల్లింపు రుసుమును వసూలు చేస్తాయి. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇలా ముందస్తు చెల్లింపు రుసుములు వసూలు చేయరు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details