How to Get Get Duplicate PAN Card Detailed Process in Telugu :దేశంలోని పౌరులందరికీ ఆధార్‌కార్డ్ ఎంత అవసరమో.. అలానే పాన్ కార్డ్ కూడా ముఖ్యమైనదిగా మారిపోయింది. బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిచినప్పుడు.. పాన్ కార్డ్‌ను లింక్ చేయడం అనివార్యం. తద్వారా.. సదరు వ్యక్తి చేస్తున్న ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకుల వద్ద నిక్షిప్తమై ఉంటాయి. ఖాతాదారుడికి సంబంధించిన ఆర్థిక పరమైన లావాదేవీల వివరాలను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పరిశీలిస్తుంటుంది. దీంతో పన్ను ఎగవేత నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అందుకే.. పాన్ కార్డ్ అనేది అందరికీ అనివార్యంగా మారిపోయింది.
ఒకవేళ మిస్సయితే..?
ఇంత ముఖ్యమైన పాన్ కార్డ్‌ను ఒకవేళ ఎవరైనా పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి అన్నది ప్రశ్న. ఎలా పొందాలి అన్నది మరో ప్రశ్న. అయితే.. అధికారులు చెబుతున్న మాట ఏమంటే.. పాన్ కార్డు పోగొట్టుకున్నట్లయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో మీరే సొంతంగా డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం సులువుగా అప్లై చేసుకోవచ్చు. ఐటీ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ పాన్ కార్డ్‌ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
How to Check PAN Card Status in Telugu : పాన్ కార్డు దరఖాస్తు ఇలా.. స్టేటస్ అలా చెక్ చేయండి!
డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి? (How to Apply for Duplicate Pan Card ) :
- దీని కోసం ముందుగా మీరు TI-NSDL అధికారిక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి.
- ఎడమవైపున ఉన్న ఆన్‌లైన్ పాన్ సర్వీస్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ఆప్లై ఫర్ ఆన్‌లైన్ పాన్ సర్వీస్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఇక్కడ మీరు మీ పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది.
- ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- ఈ సమయంలో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు సందేశం వస్తుంది.
- అంతే.. మీకు 15 నుంచి 20 రోజులలో డూప్లికేట్ పాన్‌కార్డు వస్తుంది.
- దేశంలోని అన్ని ప్రాంతాల్లో పాన్ కార్డ్ డెలివరీ ఛార్జీని రూ.50 గా నిర్ణయించారు.
- విదేశాల్లో ఉన్న వారికి డెలివరీ చేయాలంటే రూ.959 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.