20k Monthly Pension Investment Plans Details : ఉద్యోగంలో చేరినా ప్రతి వ్యక్తి.. పదవీ విరమణ చేసే నాటికి అప్పటి ఖర్చులకు అనుగుణంగా ఎంతో కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే.. పదవీ విరమణ చేసిన తర్వాత నెలవారీ ప్రాతిపదికన రెగ్యులర్ జీతం ఆశించలేరు కాబట్టి. అందుకే పదవీ విరమణ కోసం ఉద్యోగంలో చేరినా నాటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా కీలకం. తద్వారా రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, ఆనందమైన జీవితాన్ని గడపవచ్చు. దీంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండవచ్చు. అయితే, చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణకు ప్లాన్ చేసుకోకుండా వృధా ఖర్చులు చేస్తుంటారు. అటువంటివారు ఇప్పటికైనా మేల్కొని ప్రణాళికబద్దంగా పదవీ విరమణకు ప్లాన్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరి, ఆ మార్గాలు ఏమిటి..?, 2023లో ఏయే పెన్షన్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి..? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పదవీ విరమణ తర్వాత నెలవారీగా 20K పెన్షన్ పొందడానికి, పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక నిపుణులు కొన్ని ఉత్తమ మార్గాలను వెల్లడించారు.
- మొదటి నుంచే సేవ్ చేసే మార్గం
- మీ సహకారాన్ని పెంచుకునే మార్గం
- మీ పెట్టుబడులను విస్తరించుకునే మార్గం
- ప్రాయోజిత ప్రణాళికల కోసం పరుగెత్తడం
- పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లను ఎంచుకోవటం
- పన్ను ప్రయోజనాలను ఉపయోగించటం
1. మొదటి నుంచే డబ్బు ఆదా చేయడం..
Start Saving Early : మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడే మీ పదవీ విరమణ కోసం ఎంత త్వరగా డబ్బును పొదుపు చేస్తే అంత మంచిది. దీని ద్వారా కొంత కాలం పాటు మీ పెట్టుబడులు పెరగడానికి మీకు స్కోప్ లభిస్తుంది. అంతేకాకుండా, ముందుగానే పొదుపు చేయడం వల్ల పదవీ విరమణ తర్వాత మీ జీవితానికి పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరుతుంది.
NPS Scheme Benefits : రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.57 వేలు పెన్షన్!
2. మీ సహకారాన్ని పెంచుకోండి
Increase Your Contributions :20K నెలవారీ పెన్షన్‌ను పొందడానికి మరొక ఉత్తమ మార్గం.. రిటైర్‌మెంట్ ఖాతాకు మీ సహకారాన్ని అనుసంధానం చేయటం. దీని ద్వారా మీ యజమాని లేదా కంపెనీ అందించే సహకారాలు మీ పదవీ విరమణ పొదుపుకు బాగా ఉపయోగపడతాయి.