Everyone Need to Know about Limp Mode in Cars :ప్రస్తుతం ప్రజల అవసరాలు రోజురోజుకీ ఏ విధంగా పెరుగుతున్నాయో.. వారి రవాణా అవసరాలు అలాగే పెరుగుతున్నాయి. దాంతో మోటార్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ద్విచక్రవాహనాలతో పోటీ పడుతూ కార్లను కొనడానికి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ బ్రాండ్ కార్లే కాకుండా విదేశాలకు చెందిన కార్ల కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. అదే విధంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త అధునాతన ఫీచర్లతో నయా కార్లు(New Cars)మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే మీరు కారు కొనాలని భావిస్తే ముందుగా లింప్ మోడ్ టెక్నాలజీ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ లింప్ మోడ్ అంటే ఏమిటి? ఎలా పని చేస్తుంది? ఏ సమయాల్లో మీ కారు లింప్ మోడ్‌లోకి వెళ్తుంది? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం...
What is Limp Mode in Cars :ఆధునిక కార్లలో స్పీడ్ మీటర్లో కనిపించే ఒక సేఫ్టీ ఫీచరే ఈ లింప్ మోడ్(Limp Mode). ఇది మీ సిస్టమ్ లోపాన్ని ముందుగానే పసిగట్టి వాహనం పనితీరును ప్రభావితం చేస్తుంది. అంటే మీ కారు స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేస్తూ, దెబ్బతిన్న భాగాలకు నష్టం కలిగించకుండా నిరోధించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. అంతే కాకుండా కారులోని ముఖ్యమైన భాగాలు ఫెయిలయినప్పుడు కారు, డ్రైవర్‌ను రక్షిస్తుంది. అయితే కారు ఎలాంటి సందర్భాల్లో ఈ లింప్ మోడ్‌లోకి వెళ్తుందో ఇప్పుడు చూద్దాం.
Major Causes for Cars Enter into Limp Mode :మీ కారు లింప్ మోడ్‌లోకి వెళ్లడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
- ట్రాన్స్‌మిషన్, ఇంజిన్ లేదా సరిగా పనిచేయని సెన్సార్‌తో సమస్యలు లాంటివి ప్రధాన కారణాలు కావచ్చు.
- కలుషితమైన ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ లేదా కారు కంట్రోల్ మాడ్యూల్‌లో పనిచేయకపోవడం వల్ల మీ కారు లింప్ మోడ్‌లోకి వెళ్తుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.
- అదే విధంగా కొన్నిసార్లు దెబ్బతిన్న వైరింగ్ లేదా స్పార్క్ ప్లగ్‌ల కారణంగా ప్లగ్‌లు అరిగిపోయినట్లయితే మీ కారు లింప్ మోడ్‌లోకి వెళ్తుంది. అలాంటి సందర్భాల్లో మీరు లింప్ మోడ్ నుంచి బయటకు రావడానికి ముందుగా సమస్య ఎక్కడ ఉందో గుర్తించాలి.