How To Find My PPO Number : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం కల్పించిన ఆదాయ మార్గం పెన్షన్. అయితే క్రమం తప్పకుండా పెన్షన్ పొందాలంటే.. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి సదరు బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో 'యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్' లేదా 'జీవన ప్రమాణ పత్రం'ను సమర్పించాల్సి ఉంటుంది. అలా ఏడాదికోసారి దీనిని అందిస్తేనే క్రమం తప్పకుండా మీరు పెన్షన్ డబ్బులను పొందగలుగుతారు. అయితే యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ పొందాలంటే.. కచ్చితంగా మీకు PPO నంబర్ తెలియాల్సి ఉంటుంది. మరి ఈ పీపీఓ నంబర్‌ను ఆన్లైన్లో తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
PPO నంబర్ పొందండిలా!
- ముందుగా www.epfindia.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- తర్వాత Online Serviceలోని pensioner's portalపై క్లిక్ చేయాలి.
- అనంతరం పేజీ కుడి భాగంలో ఉండే pensioner's portalలో 'Know Your PPO number'పై క్లిక్ చేయాలి.
- మీ బ్యాంక్ ఖాతా నంబర్ లేదా PF సంఖ్యను ఎంటర్ చేయాలి.
- ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మీకు PPO నంబర్‌తో పాటు Member ID, ఏ రకమైన పెన్షన్‌ను మీరు పొందుతున్నారు లాంటి వివరాలు కనిపిస్తాయి.
- ఈ యూనిక్ నంబర్ అనేది పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో గానీ, యానువల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించేటప్పుడు గానీ ఉపయోగపడుతుంది.
- మీ PF ఖాతాను ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి మరొక బ్యాంక్‌కు బదిలీ చేసేటప్పుడు కూడా ఈ PPO నంబర్ ఉపయోగపడుతుంది.
Digilocker నుంచి కూడా PPO నంబర్ డౌన్లోడ్!
- EPF పోర్టల్ నుంచే కాకుండా Digilocker ద్వారా కూడా పెన్షన్ పేమెంట్ ఆర్డర్(PPO)ను సులువుగా పొందవచ్చు. ఎలాగంటే..
- ముందుగా digilocker.gov.inలో రిజిస్టర్ కావాలి. తరువాత..
- Digilocker అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- తరువాత UAN సేవలపై క్లిక్ చేసి నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- అనంతరం 'Get Document'పై క్లిక్ చేయాలి.
- చివరగా 'ePPO'ను డౌన్లోడ్ చేసుకోవాలి.
గమనిక :పైన తెలిపిన స్టెప్స్‌ను ఫాలో అవుతూ EPS స్కీమ్ సర్టిఫికేట్, UANను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.