తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Exchange Rs. 2000 Notes in Amazon Pay : అమెజాన్ పే ద్వారా.. రూ.2 వేల నోట్లను ఇలా మార్చుకోవచ్చు..! - 2000 నోట్ల రద్దు

Exchange Rs. 2000 Notes Using Amazon Pay Wallet : ప్రియమైన వినియోగదారులారా మీరు అమెజాన్ వాడుతున్నారా? అలాగే అమెజాన్ పే ద్వారా చెల్లింపులు నిర్వహిస్తూ ఉంటారా? అయితే మీకు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2000 కరెన్సీ నోట్లను అమెజాన్ పే ద్వారా మార్చుకునే వీలు కల్పించింది. అదెలాగో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Amazon Pay Wallet
Amazon Pay

By

Published : Aug 21, 2023, 1:49 PM IST

Exchange Rs. 2000 Notes Using Amazon Pay Wallet : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ వినియోగదారులు 2వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు గొప్ప అవకాశం కల్పించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీలో భాగంగా మే 19న దేశంలో చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న 2వేల రూపాయల నోట్ల(Rs. 2000 Notes Withdraw in India)ను సెప్టెంబర్ 30 వరకు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చని ప్రకటించింది.

Rs. 2000 Notes Exchange in Amazon Pay Wallet :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India)ప్రకటనతో దేశంలో చాలా మంది ప్రజలు తమ వద్ద ఉన్న 2వేల రూపాయల కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా తమ యూజర్లు 2వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అనుమతిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్​ల సమయంలో మిగిలిపోయిన మొత్తాన్ని అమెజాన్ పే(Amazon Pay)వ్యాలెట్లలో లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ-కామర్స్ దిగ్గజం ఖాతాదారులు గరిష్ఠంగా నెలకు 50వేల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని సూచించింది. వాటిలో డినామినేషన్ రూ. 2,000 కరెన్సీ నోట్లు కూడా ఉండవచ్చని తెలిపింది.

జాబ్​ మానేస్తే భారీ బోనస్- అమెజాన్ వింత ఆఫర్​!

How to Exchange Rs. 2000 Notes using Amazon Pay Wallet in Telugu :

అమెజాన్ పే వాలెట్ ఉపయోగించి రూ. 2000 వేల మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Step 1 : మొదట వినియోగదారులు తమ ఫోన్​లో Amazon యాప్​లో వీడియో KYCని పూర్తి చేయాలి.

Step 2 : ఈ KYC ప్రక్రియ పూర్తయిన తర్వాత అమెజాన్ పే వినియోగదారులు ఏదైనా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్​ చేయాలి.

Step 3 : ఆ తర్వాత కస్టమర్​లు తమ ఆర్డర్​పై డెలివరీ ఏజెంట్​కి నగదును అందజేయవచ్చు.

Step 4 : అప్పుడు డెలివరీ ఏజెంట్ నినియోగదారుడి అమెజాన్ పే బ్యాలెన్స్​లో మిగిలిన బ్యాలెన్స్​ ఆ సమయంలోనే అప్​డేట్ చేస్తారు.

Deposit 2000 Currency Notes in Amazon Pay :ఇలా అమెజాన్​ పే వాలెట్​లో అప్​డేట్ చేసిన మొత్తం.. కస్టమర్లు ఆన్​లైన్ షాపింగ్ కోసం లేదా QR కోడ్​లను ఉపయోగించి చెల్లించడం, మొబైల్ రీఛార్జ్​లు చేయడం, కుటుంబ సభ్యులు, స్నేహితులకు డబ్బులు పంపడం కోసం ఉపయోగించవచ్చు. అలాగే స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato) వంటి యాప్​లలో డిజిటల్ పేమెంట్ల కోసం వాడుకోవచ్చు. ఈ విధంగా అమెజాన్ పే బ్యాలెన్స్​ని 2వేల రూపాయల నోట్లతో మార్చుకునే లేదా అప్​డేట్ చేసుకునే సదుపాయం ప్రముఖ కామర్స్​ సంస్థ అమెజాన్ కల్పిస్తోంది.

ఈ అవకాశం వారికి మాత్రమే :అయితే ఈ విధంగా రూ. 2,000 నోట్లను మార్చుకునే అవకాశం KYC కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఎవరైనా ఈ ఎక్స్​ఛేంజ్​ని ప్రారంభించే ముందు అమెజాన్ పే వినియోగదారులు ముందు KYC ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించాలని అమెజాన్ సంస్థ పేర్కొంది.

JioBook Laptop Sales : జియోబుక్​ ల్యాప్​టాప్​ సేల్​ ప్రారంభం.. అమెజాన్​లో భారీ డిస్కౌంట్​!

IRCTCలో రైలు టికెట్స్​ బుక్​ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!

Amazon Prime Lite : తక్కువ ధరకే అమెజాన్​ ప్రైమ్​ లైట్.. కేవలం రూ.999తో సూపర్​ బెనిఫిట్స్​

ABOUT THE AUTHOR

...view details