How To Enable Credit Card Transaction Limit :ప్రస్తుత కాలంలో డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటి ద్వారా సులభంగా లావాదేవీలు జరుపుతున్నారు. అయితే ఈ కార్డ్‌లను తీసుకునే ముందు కొన్ని కీలకమైన సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్డు కంట్రోల్ మెకానిజం
Credit Card Control Mechanism : డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు తీసుకున్న తరువాత కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను సెట్ చేసుకోవాలి. దీనికోసం సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. లేదంటే నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లో బ్యాంక్ కంట్రోల్ సిస్టమ్‌లో కార్డ్ కంట్రోల్ ఆప్షన్‌లను ముందుగా ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేయకపోతే మీరు ఎలాంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలు జరపలేరు. ఈ మార్పులు (కార్డ్ కంట్రోల్స్) కార్డ్ లావాదేవీల భద్రతను మెరుగుపరుస్తాయి.
అంతా మన చేతుల్లోనే..
కొత్త మార్గదర్శకాల ప్రకారం, కార్డ్ వినియోగదారులు.. దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలపై ఒక ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ కొనుగోళ్లు, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్, వివిధ రకాల ట్రాన్సాక్షన్లపై పరిమితి విధించుకోవచ్చు.
How To Get Credit Card Without Income Source Certificate : ఇన్‌కమ్ సోర్స్ లేకున్నా.. క్రెడిట్ కార్డ్ పొందండి ఇలా!
డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?
How To Activate Credit Card Online For Transaction : కొత్త కార్డు తీసుకున్నప్పుడు వాటి కంట్రోల్ మెకానిజం అనేది డిఫాల్ట్‌గానే ఆఫ్‌లో ఉంటుంది. కావున ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ఎనేబుల్ చేయకుండా.. వాటిని ఎక్కడా వినియోగించలేరు. అది ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా సరే. ఈ ఆప్షన్ని నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదంటే నేరుగా బ్యాంక్‌కు వెళ్లి కూడా ట్రాన్సాక్షన్ లిమిట్‌ను సెట్ చేయించుకోవచ్చు.
ఆన్లైన్లో చేయాలంటే.. బ్యాంకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి చేసుకోవచ్చు. మొబైల్లో చేసుకోవాలంటే మాత్రం ఆ బ్యాంకుకు సంబంధించిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మన వివరాలతో లాగిన్ అయి.. లావాదేవీ పరిమితిని సెట్ చేసుకోవచ్చు. ఒక వేళ మీకు స్వయంగా దీనిని ఎలా ఎనేబుల్/ డిజేబుల్ చేసుకోవాలో తెలియకపోతే.. మీ బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లి సంప్రదించండి.
SBI Salary Account Benefits : శాలరీ అకౌంట్ ఓపెన్ చేయాలా?.. ఎస్బీఐ అందిస్తున్న బెస్ట్ బెనిఫిట్స్ ఇవే!
Multiple Credit Cards Benefits : మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!