How to Set up AutoPay Feature in UPI Apps in Telugu :నేటి బిజీ లైఫ్‌లో ఎవరైనా ప్రతి నెలా లేదా మరేదైనా వ్యవధిలో చెల్లించాల్సిన అన్ని బిల్లులు, పేమెంట్ల తేదీలను గుర్తుంచుకోవడం కాస్త కష్టమే. డిజిటల్ పేమెంట్ యాప్స్(Digital Payments) ద్వారా మీ ఫోన్ బిల్లుల నుంచి ఈఎంఐల వరకు లాస్ట్ పేమెంట్ తేదీలను రిమైండర్‌గా సెట్ చేసుకోవచ్చు. అయితే ప్రతిసారీ మాన్యువల్‌గా పేమెంట్లను చేయడం ఇబ్బందికరమైన విషయమే.
AutoPay Set up for Recurring Payments :ఒకవేళ మనం సకాలంలో పేమెంట్లను చేయకపోతే.. అదనపు ఆలస్య రుసుములను చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. కొన్ని సమయాల్లో సర్వీసు నిలిచిపోతుంది. మీరు తరచుగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? అయితే మీ కోసమే అన్ని యూపీఐ యాప్(UPI Apps)లలో ఆటోపే(Autopay) ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆటో ఫీచర్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనిని యూపీఐ యాప్‌లలో ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
What is Autopay in Telugu :నెలవారీ పునరావృత పేమెంట్లను సులభతరం చేసేందుకు బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్‌లు అందించే ఫీచరే ఈ ఆటోపే(Autopay). ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా గడువు తేదీ రాగానే మీరు నెలవారీ చెల్లించాల్సిన మనీ ఆటో పేమెంట్ అయిపోతుంది. దాదాపు అన్ని బ్యాంకింగ్ యాప్‌లు, ఇతర సర్వీసుల ద్వారా ఆటో పే ఆప్షన్ అందుబాటులో ఉంది.
ఉదాహరణకు ప్రతి నెలా మీరు ఒక నిర్దిష్ట తేదీన మీ ఫోన్ బిల్లు పే చేయాలనుకుందాం.. అది ప్రతి నెల 5వ తేదీ నుంచి 15వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుందనుకుందాం. ఇలాంటి సందర్భంలో, మీరు ఎలాంటి మాన్యువల్ పేమెంట్ చేయాల్సిన పనిలేదు. ఈ ఆటో ఫీచర్ ద్వారా ఆటోమేటిక్ పేమెంట్ చేయడానికి 5వ తేదీ నుంచి 15వ తేదీల మధ్య నిర్దిష్ట తేదీని సెట్ చేస్తే సరిపోతుంది.
Autopay Benefits in Telugu :ఇలా ఇదొక్కటే కాదుహోమ్ లోన్‌లు(Home Loans), EMI, సకాలంలో చెల్లించాల్సిన బిల్లుల వంటి పెద్ద చెల్లింపుల విషయంలో.. అలగే లేట్ పేమెంట్ లేదా పేమెంట్లు తప్పిన సందర్భంలో బ్యాంకులు విధించే పెనాల్టీ లేదా అదనపు ఛార్జీలను నివారించడానికి ఈ ఆటోపే ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీరు OTT సర్వీసుల కోసం నెలవారీ సభ్యత్వాన్ని కలిగి ఉంటే.. ఆ పేమెంట్లను సకాలంలో చేయడానికి ఆటోపేను వాడుకోవచ్చు. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ యాప్స్‌లో Google Pay, Phone Pe, Paytm, వంటి UPI యాప్‌లూ వినియోగదారులకు ఈ ఆటో పే ఆప్షన్ అందిస్తున్నాయి.
How to Work Autopay Feature :
ఆటోపే ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..
- యూజర్స్ రూపాయి నుంచి రూ. 5వేల మధ్య మొత్తం ఆటో పే పేమెంట్లను సెట్ చేసే అవకాశం ఉంది.
- అలాగే వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా నెలవారీ పేమెంట్లను సవరించడానికి లేదా పాజ్ చేయడానికి లేదా నిలిపివేయడానికీ ఆప్షన్ కలిగి ఉంటారు.
- అదే విధంగా యూజర్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.(పేమెంట్ అవసరం- EMI, బిల్లులు)
- నెలవారీ పేమెంట్లను UPI పిన్ నమోదు(ఒక పర్యాయం మాత్రమే) చేయడం ద్వారా అథెంటికేషన్ చేసుకోవాలి.
- అలాగే ప్రతి వారం, నెలవారీ, త్రైమాసిక చెల్లింపులకు ఆటో పే ఆప్షన్ సెట్ చేసే ఆప్షన్‌ను పొందుతారు.
Paytm, Gpay, ఇతర UPI యాప్‌లలో ఆటోపే ఫీచర్‌ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
How to Set up Autopay in Paytm Telugu :