Students How to Earn Money : గతంలో కుటుంబ పెద్ద ఒక్కరు సంపాదిస్తే సరిపోయేది. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే తప్ప, ఇల్లుగడవని కండీషన్స్ వచ్చేశాయి. ఇప్పుడు కథ మరింతగా మారిపోయింది. పెళ్లి, కుటుంబం వంటి బరువులు నెత్తికి ఎత్తుకోకుండానే.. సంపాదించాల్సిన బాధ్యత చాలా మంది భుజాల మీదకు వచ్చేస్తోంది. ఇందులో.. కొందరు స్టూడెంట్స్ కూడా ఉండడం గమనార్హం. కుటుంబ నేపథ్యం కావొచ్చు.. అత్యవసర ఆర్థిక పరిస్థితులు కావొచ్చు.. కారణాలు ఏవైనా.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సంపాదించాల్సిన పరిస్థితులో పడిపోతున్నారు. అయితే.. ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు చాలా మంది. ఇలాంటి వారికోసమే ఈ కథనం. చదువు కొనసాగిస్తూనే.. సంపాదించడానికి ఉన్న మార్గాలను మీకు అందిస్తున్నాం. ఇందులో మీ టాలెంట్ కు, ఇంకా ఇష్టానికి సంబంధించిన పని సెలక్ట్ చేసుకోండి. హ్యాపీగా సంపాదిస్తూ.. చదువుకోండి.
ట్యూటర్ :
Become a Tutor : ఇవాళ ట్యూషన్ అనేది కంపల్సరీ అయిపోయింది. వేలకు వేలు పోసి స్కూల్లో చదివిస్తున్నప్పటికీ.. తప్పనిసరిగా ట్యూషన్ పెట్టించాల్సిన పరిస్థితులో పడిపోతున్నారు పేరెంట్స్. సో.. మీకు ఏ సబ్జెక్టులో టాలెంట్ ఉంటే.. దాన్ని ఎంచుకొని ట్యూటర్ గా మారిపోవచ్చు. మీకు అనుగుణమైన వేళలను సెలక్ట్ చేసుకోవచ్చు.
Woman Inspiring Story : పది ఫెయిల్.. యూట్యూబ్ చూస్తూ నెలకు లక్షల్లో సంపాదన
ట్రాన్స్ లేటర్ :
Translator : డిగ్రీ, ఆ పైస్థాయి విద్యార్థులు ఇంగ్లీష్ లో గనక పట్టు సంపాదించి ఉంటే.. ట్రాన్స్ లేటర్ జాబ్ మీకోసం ఎదురు చూస్తోంది. ఇంగ్లీష్ నుంచి స్థానిక భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేయడానికి చాలా ఆఫర్లు ఉంటాయి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ : టైపింగ్ తెలిసి ఉంటే.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా కూడా మంచి అవకాశాలే ఉంటాయి. కొన్ని ఆఫీస్‌తో సంబంధం లేకుండా.. ఇంటి నుంచి చేసే పనులు కూడా ఉంటాయి.
గేమ్ టెస్టర్ :
Game Tester : ఇవాళ గేమింగ్ ఇండస్ట్రీ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గేమ్స్ వస్తుంటాయి. అయితే.. గేమ్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ గుర్తించడానికి గేమ్ టెస్టర్స్ ను నియమించుకుంటారు. వీరు చేయాల్సింది గేమ్ ఆడుతూ.. అందులోని లోపాలను తెలియజేయడమే.
ట్విట్టర్‌తో డబ్బు సంపాదించేందుకు రెండు ఈజీ మార్గాలు.. మస్క్ బంపర్ ఆఫర్!
కంటెంట్ రైటర్ :