తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Cancel or Close Credit Card : క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేయాలా..? ఇలా సింపుల్​గా కట్ చేయండి!

How to Cancel or Close Credit Card : మీరు క్రెడిట్ కార్డును రద్దు చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. సింపుల్​గా మీ క్రెడిట్ కార్డును క్లోజ్ చేసుకోవడానికి 4 ఉత్తమ మార్గాలను మీకు తెలియజేస్తున్నాం.

How to Cancel Credit Card in telugu
How to Cancel Credit Card

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 1:39 PM IST

How to Close or Cancel Credit Card : ప్రస్తుతం మార్కెట్​లో క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే.. అనవసరంగా ఖర్చులు పెరుగుతున్నాయని క్రెడిట్ కార్డు(Credit Cards), నెలనెలా బిల్లులు కట్టలేక సతమతమవుతున్నామని క్యాన్సిల్ చేయాలని అనుకునే వారు కూడా ఉంటున్నారు. ఇలాంటి వారు ఈజీగా క్రెడిట్ కార్డును క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Best Credit Card Cancellation Methods in Telugu :

క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయడానికి ఉన్న కొన్ని ఉత్తమ మార్గాలివే..

కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేసుకోండిలా.. మీరు సంబంధిత బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్‌ నంబర్​కు కాల్ చేసి.. మీ పేరు మీద ఉన్న క్రెడిట్ కార్డ్‌ని రద్దు చేయమని అభ్యర్థించాలి. మీ అభ్యర్థన తర్వాత బ్యాంక్ మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తుంది. క్రెడిట్ కార్డ్ రద్దుకు సంబంధించిన వివరాలను చర్చిస్తుంది. ఆ తర్వాత వారు చెప్పిన ప్రకారం మీరు క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్ జారీచేసేవారికి రాతపూర్వక అభ్యర్థనను సమర్పించడం ద్వారా..మీరు క్రెడిట్ కార్డ్ జారీచేసేవారికి రాతపూర్వక అభ్యర్థనను పంపడం ద్వారా కూడా క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయవచ్చు. మీరు రద్దు చేయాలనుకుంటున్న క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఒక లెటర్​పై రాసి దానిని సాధారణ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా క్రెడిట్ కార్డ్ జారీ చేసిన అధికారులకు పంపాలి. ఆ తర్వాత వారు అన్ని పరిశీలించి మీ కార్డు క్యాన్సిల్ అయ్యేలా చూస్తారు. మీరు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లకు కాల్ చేయడం ద్వారా వారి పోస్టల్ చిరునామాను పొందవచ్చు.

ఇ-మెయిల్ పంపడం ద్వారా కూడా క్రెడిట్ కార్డ్‌ని రద్దు చేసుకోవచ్చు.. మీరు క్రెడిట్ కార్డ్ జారీచేసేవారికి ఇ-మెయిల్ పంపడం ద్వారా క్రెడిట్ కార్డ్‌ రద్దు చేయడం కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అయితే ఇందుకోసం మీరు క్లోజ్ చేయాలనుకుంటున్న క్రెడిట్ కార్డ్ వివరాలు, మీ వ్యక్తిగత వివరాలు మొదలైనవాటిని అందించాల్సి ఉంటుంది. అనంతరం వారు పరిశీలించి మీ కార్డు క్యాన్సిల్ చేస్తారు.

ఆన్‌లైన్ రిక్వెస్ట్ ద్వారా క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేసుకోవచ్చు..కొన్ని బ్యాంకులు కస్టమర్‌లకు క్రెడిట్ కార్డ్​ను ఆన్‌లైన్‌లో రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మొదట మీరు ఆన్‌లైన్ రిక్వెస్ట్​ కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు ఫారం నింపి రిక్వెస్ట్​ను సమర్పించాలి. ఆ తర్వాత రద్దు అభ్యర్థనను నిర్ధారించడానికి బ్యాంక్ ప్రతినిధి కాల్ చేస్తారు. అప్పుడు మీ కార్డు క్యాన్సిల్ చేసుకోవాలి.

How To Save Money Using Credit Card : పండుగ షాపింగ్ చేయాలా?.. ఈ క్రెడిట్ కార్డ్​ టిప్స్​తో.. మస్త్​ డబ్బులు ఆదా చేసుకోండి!

ఎప్పుడు క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవాలంటే..? (When to Cancel a Credit Card) :

  • మీ వద్ద ఎక్కువ క్రెడిట్‌కార్డులు ఉండి నిర్వహించడం కష్టమవుతోందని భావించినప్పుడు
  • క్రెడిట్‌ కార్డు అందించే ప్రయోజనాల కంటే వార్షిక ఛార్జీలు అధికంగా ఉన్నప్పుడు
  • వడ్డీరేటు అధికంగా ఉన్నప్పుడు కూడా మీ క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకోవచ్చు.
  • ఒకవేళ మీరు స్టూడెంట్‌ కార్డు, సెక్యూర్డ్‌ కార్డును వాడుతున్నవారైతే.. రెగ్యులర్‌ కార్డుగా మార్చుకునేందుకు మీరు కార్డును క్యాన్సిల్‌ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

క్రెడిట్ కార్డును క్లోజ్ చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు :

  • క్రెడిట్ కార్డును రద్దు చేసే ముందు మీ కార్డుపై పెండింగ్‌లో ఉన్న అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్‌ను క్లియర్ చేసుకోవాలి.
  • కార్డును క్లోజ్ చేసే ముందు క్రెడిట్ కార్డు క్యాన్సిలేషన్ ప్రొసీజర్‌ను ఓసారి చదువుకోవాలి. పెనాల్టీలు ఏమన్నా పడతాయేమో చూసుకోవాలి.
  • అదేవిధంగా మీరు క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే ముందు.. మీ దగ్గర ఉన్న రివార్డు పాయింట్లను అన్నింటినీ వాడుకోవాలి.
  • అలాగే ఆటోమేటిక్ బిల్ పేమెంట్లు, ట్రాన్స్‌ఫర్స్ ఆన్‌లో ఉంటే.. క్యాన్సిల్ చేసుకోవాలి.

చివరగా..కార్డు వినియోగించట్లేదని అనుకున్నప్పుడు.. కార్డును రద్దు చేయడంలో తప్పులేదు. అయితే కార్డు రద్దుకు ముందు బకాయిలు పూర్తిగా చెల్లించడం, కార్డుపై ఉన్న ఆటోమేటిక్‌ పేమెంట్స్‌ను రద్దు చేయడం ముఖ్యం. అలాగే, క్రెడిట్‌ కార్డును క్యాన్సిల్‌ చేసినప్పుడు, దానికి అనుబంధంగా తీసుకున్న యాడ్‌-ఆన్‌ కార్డులు కూడా రద్దవుతాయి. కార్డు క్లోజ్‌ అయ్యిందని నిర్ధారించుకున్న తర్వాత కార్డును ముక్కలు చేసి నాశనం చేయవచ్చు.

Credit Card Cashbacks Latest Update : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? మీకో షాకింగ్​ న్యూస్..!​

How To Reduce Credit Card Debt : క్రెడిట్ కార్డు అప్పులతో విసిగిపోయారా? రుణభారం ఇలా తగ్గించుకోండి!

కొత్తగా క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

ABOUT THE AUTHOR

...view details