తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫారిన్ ట్రిప్​కు వెళ్తున్నారా? ప్రయాణ బీమా మస్ట్! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

How To Claim Travel Insurance : ట్రావెల్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి? విదేశీ ప్రయాణాల సమయంలో ఇది ముఖ్యమా? దీనిని క్లెయిం చేసుకోవాలంటే గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Tips To Claim Travel Insurance In Telugu
How To Claim Travel Insurance

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 1:14 PM IST

How To Claim Travel Insurance : విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు ప్రయాణ బీమా తీసుకోవడం ఉత్తమం. మనకు పరిచయం లేని ప్రాంతంలో అనుకోకుండా వైద్య అవసరాలు ఏర్పడవచ్చు, ప్రయాణం రద్దవ్వచ్చు, విమానాలు ఆలస్యంగా రావచ్చు, సామాన్లు, పాస్‌పోర్ట్‌ పోగొట్టుకోవచ్చు. ఇలాంటి అన్ని నష్టాలన్నింటి నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ పాలసీ. మరి దీనిని క్లెయిం చేసుకోవాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రయాణం రద్దైతే..?
Travel Cancellation Insurance : వ్యక్తిగత కారణాలతో ఒకవేళ మీ విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఆ విషయాన్ని బీమా సంస్థకు తెలియజేయాలి. క్లెయిం పత్రాన్ని నింపేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. పాలసీ కవరేజీ, నిబంధనల వర్తింపు ఆధారంగా సదరు క్లెయిం అభ్యర్ధనను పరిశీలించి తగిన పరిహారాన్ని వినియోగదారుకు అందిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. అయితే రిఫండ్‌ చేయని హోటల్‌ బుకింగ్‌లు, విమాన టిక్కెట్ల వంటి వాటి ఖర్చుల్లో ముందుస్తుగా చెల్లించిన వ్యయాలను మాత్రమే ప్రయాణ బీమా పాలసీ చెల్లిస్తుందని మాత్రం మర్చిపోకండి.

వస్తువులు పోగొట్టుకుంటే..?
What To Do If We Lost Belongings In Flight Travel :సాధారణంగా ప్రజా రవాణా వినియోగించే సమయంలో చాలా మంది తమ తమ వస్తువులను కోల్పోతుంటారు. ముఖ్యంగా విమాన ప్రయాణాల సమయంలోఇలా జరుగుతుంది. ఇలాంటి ఊహించని పరిస్థితుల్లో పాలసీలో పేర్కొన్న మొత్తాన్ని మీరు క్లెయిమ్​ చేసుకోవడం ద్వారా మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. అయితే మీరు సామగ్రిని పోగొట్టుకున్నప్పుడు ఆ విషయాన్ని సంబంధిత బీమా సంస్థకు తెలియజేయాలి. అప్పుడే వారు సరైన మార్గనిర్దేశం చేయగలరు. కాగా, బ్యాగేజీ పూర్తిగా నష్టపోయినప్పుడు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. పాక్షిక నష్టానికి సంబంధించిన పరిస్థితుల్లో పరిహారం అందించేందుకు బీమా కంపెనీలు నిరాకరిస్తాయని మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ విమాన సంస్థ సగం పరిహారం ఇస్తే.. మిగతా మొత్తాన్ని మాత్రమే బీమా సంస్థ చెల్లిస్తుంది. ఉదాహరణకు నష్టం రూ.10వేలు అనుకుందాం. ఇందులో రూ.2వేలను విమాన సంస్థ చెల్లిస్తే.. మిగతా రూ.8 వేలను బీమా సంస్థ ఇస్తుంది.

బ్యాగేజీ ఆలస్యమైతే..?
Baggage Delay Travel Insurance :మీరు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకున్నారు. అప్పటికీ మీ దగ్గరకు చేరాల్సిన బ్యాగేజీ ఇంకా రాలేదనుకోండి. అప్పుడు మీ టూర్​ ప్లాన్​ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ప్రయాణంలో మనకు కావాల్సిన వస్తువులు సకాలంలో అందకపోతే మనం తిరగాలనుకున్న ప్రదేశాలను తిరగలేము. అయితే సరైన టైమ్​కు ఒకవేళ మీకు బ్యాగేజీ అందకపోతే ఏమాత్రం భయపడకండి. తాజా పరిస్థితుల గురించి ముందుగా విమాన సంస్థ సిబ్బందికి తెలియజేయండి. ఈ విషయంలో వారు మీకు తప్పక సాయం చేస్తారు. ఒక్కోసారి మీకు చెందిన సామాన్లు వేరే వారికి అందడం లేదా ఎయిర్​పోర్టులోనే వదిలేసే అవకాశాలు లేకపోలేదు. ఈ సందర్భాల్లో మళ్లీ మీ బ్యాగేజీ మీ దగ్గరికి తిరిగి రావటానికి కొన్ని గంటల నుంచి రోజుల సమయం పట్టవచ్చు. ఇలాంటప్పుడు మీకు ప్రయాణ బీమా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు పాలసీ నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తాన్ని అందుకోవచ్చు. అయితే ఇది మీకు వర్తించాలంటే క్లెయిం కోసం అప్లై చేసేటప్పుడే బోర్డింగ్‌ పాస్‌లు, బ్యాగేజీ క్లెయిం ట్యాగ్‌లతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

పాస్‌పోర్ట్‌ మిస్​ అయితే..?
Lost Passport Travel Insurance :విదేశీ ప్రయాణాలు చేయాలంటే కచ్చితంగా కావాల్సిన పత్రాల్లో పాస్‌పోర్ట్‌ అత్యంత ముఖ్యమైనది. దురదృష్టవశాత్తు దీనిని పోగొట్టుకుంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో వెంటనే అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. అనంతరం వారు ఇచ్చే ఎఫ్‌ఐఆర్‌ కాపీని తీసుకోండి. తర్వాత దగ్గర్లోని ఇండియన్​ ఎంబసీని సంప్రదించండి. దీంతో మీకు అక్కడి అధికారులు అత్యవసర ప్రయాణ పత్రాన్ని లేదా పాస్‌పోర్ట్‌ను జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు క్లెయిం ప్రాసెస్‌ కోసం ఈ విషయాన్ని బీమా సంస్థకు తెలియజేయాలి. అప్పుడే కొత్త పాస్‌పోర్టును పొందే ప్రక్రియలో మీరు చేసిన ఖర్చులను ప్రయాణ బీమా పాలసీ ద్వారా పొందవచ్చు.

ఇవీ గుర్తుంచుకోండి..!
Travel Insurance Claim Tips : ప్రయాణ బీమా క్లెయిం దాఖలుకు అవసరమైన పత్రాలను ఎప్పుడూ మీ వెంటే ఉంచుకోండి. ఉదాహరణకు మెడికల్​ రిపోర్టులు, రశీదులు, పోలీసు నివేదికలు మొదలైనవి. క్లెయిం ఫారాన్ని నింపే సమయంలో అవసరమైన అన్ని వివరాలను అందించండి. అప్పుడే బీమా సంస్థ మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. క్లెయిం ఆమోదయోగ్యం అయినప్పుడు సులువుగా పరిహారాన్ని పొందవచ్చు.

భారీగా పెరిగిన గోల్డ్​ రేట్​- తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

బంగారం కొంటున్నారా? బిల్లు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే!

ABOUT THE AUTHOR

...view details