How to Choose The Best Two Wheeler Loan :బైక్ ఇప్పుడు చాలా మందికి నిత్యావసరంగా మారిపోయింది. అందుకే.. ఒకేసారి డబ్బు చెల్లించలేని వారు ఫైనాన్స్ మీద బండి తీసుకుంటారు. నిజానికి ఇలా.. అప్పు మీద బైక్(Bike) కొనుగోలు చేసేవారే అధికంగా ఉంటారు. మీరు కూడా.. టూ వీలర్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నట్టయితే.. కొన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. మరి, అవేంటి? తేడా వస్తే ఎలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వడ్డీ రేట్లను కంపేర్ చేయండి :
- మీరు టూవీలర్ లోన్ తీసుకునే బ్యాంకు లేదా సంస్థలో వడ్డీరేట్లను చెక్ చేయండి.
- కనీసం ఐదారు బ్యాంకులను కంపేర్ చేసి.. ఎందులో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో చూడండి.
- వడ్డీ రేటు నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోర్ కూడా కీలకమే.
- మీరు తీసుకుంటున్న టూ-వీలర్ మోడల్, లెండర్ నిబంధనల ప్రకారం.. 9.5% నుంచి 17% మధ్య వడ్డీ రేటు ఉండే ఛాన్స్ ఉంది.
లోన్ కాలపరిమితిని చూసుకోండి :
- మీరు తీసుకున్న రుణాన్ని EMI ద్వారా ఎంత కాలంలో తిరిగి చెల్లించబోతున్నారనేది కూడా ముఖ్యమే.
- ఒకవేళ మీరు ఎక్కువ కాలపరిమితితో లోన్ తీసుకుంటే తక్కువ EMI ఉంటుంది. కానీ, మీరు అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుందని మరిచిపోకండి.
- మీరు నెలవారీ చెల్లించాల్సిన EMI ఎక్కువగా ఉంటే.. వడ్డీ తక్కువ చెల్లిస్తారు.
- అందువల్ల.. ఈ రెండు అంశాలపై లెక్కలు వేసుకొని.. లోన్ కాలపరిమితిని నిర్ణయించుకోవాలి.
Car Loan Precautions : కార్ లోన్ కావాలా?.. ఈ టిప్స్ పాటిస్తే తక్కువ వడ్డీతో.. లోన్ గ్యారెంటీ!
లోన్ ఎక్కువ తీసుకోవద్దు :
- టూ వీలర్ లోన్ ఈజీగా అందుబాటులో ఉందంటూ.. ఎక్కువ రుణం తీసుకోకండి.
- ఎక్కువ రుణం తీసుకుంటే.. EMI పెరిగిపోతుంది.
- మధ్యలో ఏవైనా అవాంతరాలు వస్తే.. మొత్తం మీ బడ్జెట్ ప్లాన్ తలకిందులు కావొచ్చు.
- EMI సమయానికి చెల్లించకపోతే.. భవిష్యత్తులో మీ క్రెడిట్ అవకాశాలు తగ్గిపోతాయి.