తెలంగాణ

telangana

ETV Bharat / business

బెస్ట్ కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డ్​ ఎంచుకోవాలా? టాప్​-7 టిప్స్​ మీ కోసమే!

How To Choose The Best Co Branded Credit Card In Telugu : మీరు కొత్తగా కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డులు తీసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ అవసరాలు తీర్చే బెస్ట్ క్రెడిట్ కార్డును ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Choose the Best co branded Credit Card
How to Choose the Best Credit Card

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 2:04 PM IST

How To Choose The Best Co BrandedCredit Card : క్రెడిట్ కార్డు యూజర్లను లక్ష్యంగా చేసుకుని బ్యాంకులు, వివిధ సంస్థలు కలిసి కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా, ఆకర్షణీయమైన రాయితీలతో ఈ కార్డులను అందిస్తున్నాయి. అందుకే వీటికి ఎంతో ఆదరణ లభిస్తోంది. అయితే ఈ కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డులను ఎలా ఎంచుకోవాలి? వీటి వల్ల కలిగే లాభాలు ఏమిటి? ఇవి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

భారీగా పెరుగుతున్నాయి!
మన దేశంలో 9 కోట్లకుపైగా యాక్టివ్​ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. వీటి సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. ఈ కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డులతోపాటు, అవి అందిస్తున్న బెనిఫిట్స్ కూడా మారుతూనే ఉన్నాయి. క్రెడిట్‌ కార్డు యూజర్లకు, బ్రాండ్లకు మధ్య ఒక బలమైన వ్యాపార భాగస్వామ్యాన్ని సృష్టించేందుకు ఈ కో-బ్రాండెడ్​ క్రెడిట్​ కార్డులు దోహదం చేస్తాయి. తమ జీవనశైలికి, ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రత్యేకమైన రాయితీలు, ప్రయోజనాలూ కోరుకునే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మీరు కొత్తగా కో-బ్రాండెడ్‌ క్రెడిట్​ కార్డు తీసుకుందామని అనుకుంటే, కొన్ని విషయాలు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. అవసరాలకు తగినట్లుగా
కో-బ్రాండెడ్‌ కార్డులు ప్రధానంగా రివార్డు పాయింట్లను అందిస్తాయి. బ్యాంకులు, తాము ఒప్పందం చేసుకున్న బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోళ్లు చేసినవారికే ఈ రివార్డ్ పాయింట్లను పరిమితం చేస్తాయి. ఉదాహరణకు ఒక బ్యాంకు - ఓ విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అనుకుందాం. ఆ విమాన సంస్థకు చెందిన టిక్కెట్లు బుకింగ్‌ చేసుకున్నప్పుడే, యూజర్లకు రాయితీలు, ఇతర బెనిఫిట్స్​ అందిస్తాయి. అలాగే బ్యాంకులు, కొన్ని రిటైల్‌ సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. యూజర్లు వారి దగ్గర కొనుగోళ్లు చేసినప్పుడే నిర్ణీత ప్రయోజనాలు అందిస్తాయి. కనుక, మీ అవసరాలు ఏమిటి? వాటిని ఏ క్రెడిట్​ కార్డు తీరుస్తుంది? అనేది చూసుకోవాలి. కొన్ని కార్డులు యూజర్లకు ప్రత్యేక సేవలను కూడా అందిస్తుంటాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి.

2. రాయితీలు : బ్యాంకులు సాధారణంగా కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేసిన తొలి ఏడాదిలో, యూజర్ల నుంచి ఎలాంటి వార్షిక రుసుములు వసూలు చేయవు. పైగా నో-కాస్ట్‌ ఈఎంఐ సౌకర్యాన్ని, గణనీయమైన రాయితీలను అందిస్తాయి. తమతో భాగస్వామ్యం ఉన్న బ్రాండ్ల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్​, క్యాష్ బ్యాక్స్​ లాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంటాయి. వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు.

3. సరైన కార్డు : సాధారణ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే, కో-బ్రాండెడ్​ క్రెడిట్​ కార్డులు అందించే ప్రయోజనాలు కాస్త అధికంగానే ఉంటాయి. అందుకే మీ అవసరాలు తీర్చే సరైన కార్డును ఎంచుకోవాలి.

4. ఖర్చులు : మీ జీవనశైలికి, అలవాట్లకు అనుగుణంగా క్రెడిట్​ కార్డు ఉందా? లేదా? చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ సాధారణ ఖర్చులను విశ్లేషించుకోవాలి. మీరు తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటే, విమానయాన సంస్థలు, హోటళ్లు అందించే కో-బ్రాండెడ్‌ కార్డులను ఎంచుకోవాలి. లేదా హోటళ్లు, విమాన టిక్కెట్లు బుకింగ్‌ చేసుకునే సంస్థలతో ఒప్పందం ఉన్న కార్డులను తీసుకోవాలి. మీరు ఎప్పుడూ ఒకే రిటైల్‌ మాల్‌లో కొనుగోళ్లు చేస్తుంటే, దానికి సంబంధించిన కో-బ్రాండెడ్‌ కార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

5. రివార్డులు : కో-బ్రాండెడ్ కార్డును వాడిన ప్రతిసారీ రివార్డు పాయింట్లు వచ్చేలా ఉండాలి. ఇలా సంపాదించిన రివార్డు పాయింట్లను అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలి. దీనివల్ల మరిన్ని బెనిఫిట్స్ పొందడానికి వీలవుతుంది.

6. రుసుములు : కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు తీసుకునే ముందు కచ్చితంగా వార్షిక రుసుములు గురించి తెలుసుకోవాలి. అలాగే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. నెలవారీ బిల్లులను పూర్తిగా కాకుండా, కనీస మొత్తం చెల్లిస్తే, మిగతా మొత్తానికి విధించే వడ్డీ రేట్లు గురించి కూడా తెలుసుకోవాలి. విదేశాల్లో జరిపే లావాదేవీలకు ఎలాంటి ఫీజులు వసూలు చేస్తారనేది పరిశీలించాలి.

7. ఎక్స్​ట్రా బెనిఫిట్స్​ : ప్రయాణ బీమా, కొనుగోళ్లకు రక్షణ, మోసపోయినప్పుడు కార్డుదారుడి బాధ్యత లాంటి అదనపు ప్రోత్సాహకాలను కూడా చూసుకోవాలి. క్రెడిట్‌ కార్డు అందిస్తున్న సంస్థ, ఒప్పందం కుదుర్చుకున్న బ్రాండు - ఈ రెండింటినీ పరిశీలించాలి. బలమైన బ్రాండ్లతో భాగస్వామ్యం ఉన్న కార్డులను ఎంచుకోవాలి. అప్పుడే మీకు మంచి లాభం ఉంటుంది. లిమిటెడ్ బెనిఫిట్స్​ అందిస్తూ, అధిక రుసుములు వసూలు చేసే కార్డులకు దూరంగా ఉండడం మంచిది. క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా తీర్చేయాలి. లేకపోతే భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. పైగా క్రెడిట్‌ స్కోరుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు, క్రెడిట్​ కార్డులను వాడేటప్పుడు వ్యయ నిష్పత్తి తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.

ధూమపానం, మద్యపానం జీవిత బీమా ప్రీమియంను ప్రభావితం చేస్తాయా?

యువ ఇంజినీర్లకు గుడ్​న్యూస్- రిలయన్స్ భారీ రిక్రూట్​మెంట్​ డ్రైవ్- దరఖాస్తు ప్రక్రియ ఇదే!

ABOUT THE AUTHOR

...view details