తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Check Unclaimed Deposits Details in UDGAM: అన్​ క్లెయిమ్డ్​ డిపాజిట్స్​ కోసం 'ఉద్గం'.. ఎలా చెక్​ చేసుకోవాలంటే..?

RBI Launches UDGAM For Unclaimed Deposits: దశాబ్దాలుగా బ్యాంకుల్లో ఉన్న అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు సంబంధించి సమాచారాన్ని వెల్లడించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక ముందడుగు వేసింది. అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలను తెలుసుకునేందుకు ఓ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. అది ఏంటి..? దానిని ఉపయోగించి వివరాలు ఎలా తెలుసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

How to Check Unclaimed Deposits Details in UDGAM
How to Check Unclaimed Deposits Details in UDGAM

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 5:25 PM IST

RBI Launches UDGAM For Unclaimed Deposits: సంవత్సరాల తరబడి బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను (ఎవరూ క్లెయిమ్‌ చేయని) వాటి హక్కుదార్లకు అప్పగించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఒక సెంట్రలైజ్డ్​ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. కుటుంబ సభ్యులకు తెలీని పెట్టుబడులు, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి మరిచిపోయిన వాటి గురించి ఈ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. గతంలో.. విడివిడిగా ఒక్కో బ్యాంక్‌ సైట్‌లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చేది. పదుల సంఖ్యలో ఉన్న బ్యాంక్‌ సైట్లలోకి వెళ్లి కనుక్కోవడం చాలా శ్రమతో పాటు కాలయాపనతో కూడిన పని. అయితే ఈ కొత్త పోర్టల్‌ ద్వారా ఆ వివరాలన్నీ ఒకేచోట తెలుస్తాయి.

Rupee Internationalisation RBI : రూపాయి అంతర్జాతీయీకరణ సాధ్యమేనా?

RBI UDGAM Portal: ఉద్గం (Unclaimed Deposits – Gateway to Access inforMation) పేరిట గత కొన్ని రోజుల క్రితం రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (REBIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (IFTAS) భాగస్వామ్యంతో ఈ పోర్టల్​ రూపొందింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్‌-క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు అన్నీ ఈ పోర్టల్‌లో కనిపిస్తాయి. డిపాజిటర్‌ పేరు, ఇతర వివరాలతో వెతికితే.. ఆ వ్యక్తికి ఏదైనా బ్యాంక్‌లో అన్‌-క్లెయిమ్డ్‌ డిపాజిట్‌ ఉంటే తెలుస్తుంది. తద్వారా ఆ డిపాజిట్‌ను క్లెయిమ్‌ చేసుకోవడం సులభం అవుతుంది. ప్రస్తుతానికి ఉద్గం పోర్టల్‌లో కొన్ని బ్యాంకులు చేరాయి. అవి..

  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)
  • యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(Union Bank of India)
  • ధనలక్ష్మి బ్యాంక్‌
  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌
  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌
  • DBS బ్యాంక్‌ ఇండియా
  • సిటీ బ్యాంక్‌

ఈ బ్యాంకుల్లో ఉన్న అన్‌-క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలను ఉద్గం పోర్టల్‌లో చూడవచ్చు. మిగతా బ్యాంకులను కూడా ఈ పోర్టల్‌కు లింక్‌ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ సంవత్సరం(2023) అక్టోబరు 15 నాటికి, అన్ని బ్యాంకులను దశలవారీగా ఉద్గం పోర్టల్‌లో అందుబాటులోకి తెస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

RBI Assistant Notification 2023 : డిగ్రీ అర్హతతో.. ఆర్​బీఐలో 450 అసిస్టెంట్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

అసలు అన్‌-క్లెయిమ్డ్‌​ డిపాజిట్స్​ అంటే ఏమిటి?:

What is Unclaimed deposits: 10 సంవత్సరాలకు మించి ఎవరూ క్లెయిమ్‌ చేసుకోకుండా బ్యాంకుల్లో ఉండిపోయిన డిపాజిట్లను అన్‌-క్లెయిమ్డ్‌ డిపాజిట్లుగా పిలుస్తారు. బ్యాంక్‌ ఖాతాలు, పథకాల్లో డబ్బులు డిపాజిట్‌ చేసి మరిచిపోవడం లేదా డిపాజిట్‌ చేసిన వ్యక్తి హఠాత్తుగా మరణించడం వల్ల వాటి గురించి కుటుంబ సభ్యులకు తెలీకపోవడం అన్‌-క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు కారణం.

Required Documnets to Check Unclaimed Deposits in UDGAM: ఉద్గం పోర్టల్​లో అన్‌-క్లెయిమ్డ్‌​ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవాలంటే వీటిలో ఖాతాదారుడికి సంబంధించిన ఓ డాక్యుమెంటు కచ్చితంగా ఉండాలి.

  • ఖాతాదారు పాన్​ కార్డ్​/ Voter ID/డ్రైవింగ్​ లైసెన్స్​/పాస్​పోర్ట్​

Damaged Currency Exchange : మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా?.. సింపుల్​గా మార్చుకోండిలా!

ఉద్గం పోర్టల్​లో అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్​ వివరాలను ఎలా తెలుసుకోవాలి..?

How to Check Unclaimed deposits through UDGAM Portal..?

  • ముందుగా గూగుల్​లో ఉద్గం అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి.(https://udgam.rbi.org.in )
  • Unclaimed Deposits ఆప్షన్​పై క్లిక్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత Register ఆప్షన్​పై క్లిక్​ చేసి.. ఫోన్​ నెంబర్​, పేరు, తదితర వివరాలు ఎంటర్​ చేసి లాగిన్​ పై క్లిక్​ చేస్తే ఫోన్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్​ చేసి వెరిఫై చేసుకోవాలి.
  • అనంతరం మొబైల్​ నెంబర్​, పాస్​వర్డ్​తో లాగిన్​ అవ్వాలి.
  • అప్పుడు స్క్రీన్​ మీద వివరాలు ఎంటర్​ చేయాలి. అవి ఖాతాదారు పేరు, బ్యాంక్​, పాన్​ లేదా ఓటర్​ ఐడీ లేదా డ్రైవింగ్​ లైసెన్స్​ లేదా పాస్​పోర్టు నెంబర్​ ఎంటర్​ చేయాలి.
  • అనంతరం పుట్టినరోజును ఎంటర్​ చేసి.. Search ఆప్షన్​పై క్లిక్​ చేసుకోవాలి.
  • అప్పుడు స్క్రీన్​ మీద అన్​క్లైమ్​డ్​ వివరాలు కనిపిస్తాయి.

Rs 2000 Notes Exchange News : రూ.2 వేల నోట్లపై RBI కీలక ప్రకటన.. 93% నోట్లు వాపస్!

ABOUT THE AUTHOR

...view details