How to Track PAN Card Status in Telugu :పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి ఎంత విలువైన డాక్యుమెంట్లో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలు చేయడానికి పాన్ కార్డు చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఏదైనా సంక్షేమ పథకాలను పొందాలంటే ఆధార్ కార్డు(Aadhaar Card)తో పాటు పాన్ కార్డును కూడా అడుగుతున్నారు. ఇవి రెండు కార్డులు చాలా చోట్ల గుర్తింపు కార్డులుగా పనిచేస్తున్నాయి.
PAN Card Status Check Online : మరోవైపు ఆధార్-పాన్ కార్డును లింక్ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే.. ఇందులోని ఆల్ఫా-న్యూమరికల్ కోడ్‌ను ఎవరు డూప్లికేట్ కూడా చేయలేరు. ఆదాయ వ్యవహారాల విషయంలో ఈ రెండింటి అనుసంధానం కీలకంగా మారింది. దీంతో.. ఇప్పటి వరకూ పాన్ కార్డు లేనివారు అనివార్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి. మరి, మీరు కొత్తగాపాన్ కార్డు(PAN Card)కు దరఖాస్తు చేయాలా? లేదంటే.. అప్లై చేసి చాలా రోజులైంది ఇంకా రాలేదని చూస్తున్నారా? ఇక ఆలస్యమెందుకు మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మొదటగా.. ఆన్‌లైన్‌లోకి వెళ్లి https://tin.tin.nsdl.com/pan/index.html అడ్రస్‌లోకి వెళ్లండి.
- అక్కడ "New PAN Card" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఇండియన్/ఫారెన్ సిటిజన్ అనే ఆప్షన్ వస్తుంది.
- ఆ తర్వాత పేరు, బర్త్ డేట్, లింగం, అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు ఇవ్వాలి.
- గుర్తింపు కార్డు, నివాస ధ్రువత్రం, బర్త్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేయాలి.
- తర్వాత దరఖాస్తు ఫీజు ఆన్లైన్ పద్ధతిలో చెల్లించాలి.
- అంతా ఓకే అనుకున్న తర్వాత.. సబ్మిట్ చేసి, రిసిప్ట్ (అక్నాలెడ్జ్ మెంట్) ప్రింట్ తీసుకోవాలి.
- ఆ తర్వాత రిసిప్ట్ పై సంతకం చేసి.. 2 పాస్ ఫొటోలు అప్లోడ్ చేయాలి
- అప్లికేషన్ ఫాం, డాక్యుమెంట్లు NSDL అడ్రస్‌కు పంపించారు.
- అంతే.. మీరు సమర్పించిన ఆడ్రస్‌కు వారాల వ్యవధిలో పాన్ కార్డు వచ్చేస్తుంది.
PAN Card Status Track Through NSDL :
స్టేటస్‌ను తెలుసుకోండిలా..
Step 1 : మొదట మీరు ఎన్ఎస్డీఎల్ పాన్‌కార్డు ట్రాకింగ్ పోర్టల్‌కు వెళ్లండి
Step 2 : అక్కడ 'PAN Card Status' అనే దానిపై క్లిక్ చేయండి.
Step 3 : అనంతరం మీ పాన్ కార్డు నంబరు, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి
Step 4 : చివరగా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే.. మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
Check PAN Card Status through SMS :
మీ పాన్‌కార్డు స్టేటస్‌ను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోండిలా..
1. మొదట మీరు దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్ నుంచి 567676కు మీ పాన్ కార్డు నంబర్‌ను "PAN" తర్వాత టైప్ చేసి పంపించండి.
2. అనంతరం మీ పాన్ కార్డు స్టేటస్ పూర్తి వివరాలతో కూడిన SMS మీ ఫోన్‌కు వస్తుంది.
పెళ్లి తర్వాత పాన్ కార్డుపై ఇంటి పేరు మార్చాలా? అయితే ఇలా చేయండి
PAN Card Status Check Acknowledgement Number :
అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ద్వారా మీ కార్డు స్టేటస్‌ను చెక్ చేసుకోండిలా..
1. మొదట మీరు ఎన్ఎస్డీఎల్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. 'Check PAN Card Status' పై క్లిక్ చేయండి.
3. అనంతరం 'అప్లికేషన్ టైప్' ఆప్షన్ మీద క్లిక్ చేసి "PAN-New/Change Request"ని ఎంచుకోండి.