How to Check GST Payment Status Online in Telugu :దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో వస్తుసేవల పన్ను (Goods and Service Tax) అతిపెద్ద సంస్కరణగా చెప్పవచ్చు. పలు రకాల పన్నులను విలీనం చేసి GSTని అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీ విధానం 2017 జూలై నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
Goods and Service Tax Slabs :వస్తుసేవలపై శ్లాబుల వారీగా సున్నా శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా పన్నులను విధిస్తున్నారు. కొన్ని పన్నులు మినహా దాదాపు అన్ని రకాల పన్నులను కలిపి సమగ్రమైన GSTని తెచ్చారు. అలాగే.. కొన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు సెస్‌ను కూడా విధిస్తున్నారు. అయితే.. అన్ని రకాల ఉత్పత్తులపై వస్తుసేవల పన్ను ఒకే విధంగా ఉండదు. నిత్యం మనం వాడే వస్తుసేవలపై ఈ పన్ను వేర్వేరుగా ఉంటుంది. జీఎస్టీ(GST)లోనూ సీజీఎస్టీ(సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్), ఎస్జీఎస్టీ (స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్), ఐజీఎస్టీ(ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్) అనే మూడు రకాలున్నాయి.
Check GST Payment Status Online Process : ఈ క్రమంలో వ్యాపారస్తులు, పన్ను చెల్లింపుదారులు ప్రతినెలా.. లేదా త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లిస్తారు. కానీ.. చాలామంది పన్ను చెల్లించాక తమ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోరు. దాంతో తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే నానా ఇబ్బందులు పడతారు. అయితే.. చాలామందికి తమ నెలవారీ లేదా త్రైమాసిక జీఎస్టీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఆగిపోతుంటారు. ఇప్పుడు చింతించాల్సిన పని లేదు. సింపుల్‌గా ఆన్లైన్లో కింద పేర్కొన్న విధంగా మీ జీఎస్టీ చెల్లింపు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
GST On Diesel Vehicles : డీజిల్ వాహనదారులకు షాక్!.. పొల్యూషన్ టాక్స్‌గా.. 10% జీఎస్టీ పెంపు!