How To Check Gas Subsidy Status : దాదాపుగా ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. గతంలో వంట చేసుకోవడానికి కట్టెల పొయి వాడేవారు కానీ.. క్రమేణా పెరిగిన టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన వనరులతో గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా అర్హులైన వినియోగదారులకు 14.2 కిలోగ్రాముల 12 సిలిండర్లను ఇస్తుంది. కట్టిన బిల్లులో కొంత కొంత మొత్తం సబ్సిడీ ఇస్తుంది. PAHAL (DBTL) పథకం కింద, LPG సిలిండర్‌లపై సంవత్సరానికి రూ. 10 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ సంబంధిత వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
Gas Subsidy Check Online : అయితే.. గ్యాస్ సిలిండర్‌పై వచ్చే ఈ సబ్సిడీని ఎలా చెక్ చేయాలో చాలా మందికి తెలియదు. ఆన్లైన్లో మీ సబ్సిడీ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలైన IOCL, HP, BPCLలో మీ గ్యాస్ సబ్సిడీ స్థితిని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు మీ ఎల్పీజీ ఐడీ తెలుసుకోవాలి.
- ముందుగా http://mylpg.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- అక్కడ పైన కుడి వైపున మీ LPG ID కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
- అక్కడ మీ గ్యాస్ కంపెనీ పేరు అడుగుతుంది. భారత్, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. అందులో నుంచి మీరు వాడే కంపెనీ పేరు ఎంచుకోండి.
- తర్వాత మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఫోన్ నంబరు లేదా గ్యాస్ పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ పేరు, వినియోగదారుని నంబరు అడుగుతుంది. ఆ వివరాలు నింపాలి.
- ఆ తర్వాత అక్కడ కనిపించే captcha code (క్యాప్చా కోడ్) ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు LPG ID వస్తుంది.