How to Check FASTag Balance in Online :జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు టోల్ ప్లాజాలను దాటడం గతంలో ప్రధాన సమస్యగా ఉండేది. టోల్ గేట్ల వద్ద ఉండే పొడవైన క్యూలలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫాస్ట్‌ట్యాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(RFID) టెక్నాలజీని ఉపయోగించే పరికరం. ఇది.. వాహనం టోల్ ప్లాజా వద్దకు రాగానే.. స్కాన్ చేయడం ద్వారా.. టోల్ ఫీజును అకౌంట్ నుంచి డెబిట్ చేస్తుంది. ఈ పద్ధతి ద్వారా.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు వసూలు మరింత సులభతరం అయింది. ప్రభుత్వం, భాగస్వామ్య బ్యాంకులతోపాటు అనుమతి పొందిన అధికారిక ట్యాగ్ జారీదారులు ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నారు.
Best Methods for Check Fastag Balance Easily :ఫాస్ట్‌ట్యాగ్ పొందడం కోసం కనీస రీఛార్జ్ మొత్తం 100 రూపాయలుగా ఉంది. అయితే.. గరిష్ఠ మొత్తం వాహనం రకం, ఫాస్ట్‌ట్యాగ్ సేవకు లింక్ చేయబడిన అకౌంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే.. ఆ వాహనం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకమైన ఫాస్ట్‌ట్యాగ్ లేన్‌లో ప్రయాణించడానికి అనుమతి ఉండదు. అంతేకాదు.. నాన్-ఫాస్ట్‌ట్యాగ్ లేన్‌లోకి ప్రవేశించి, రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలో తక్కువ లేదా జీరో బ్యాలెన్స్ ఉండటం వల్ల.. వినియోగదారు ఖాతా బ్లాక్‌లిస్ట్ కూడా చేయబడుతోంది. కాబట్టి వాహన యజమానులు వారి ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్(FASTag Balance)ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.
Check FASTag Balance :ఈ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌పై.. నిత్యం వాహనాల్లో ప్రయాణించే వారికి ఓ అంచనా ఉంటుంది. కానీ, అదే పండగల సమయంలో లేదా అవసరం కొద్దీ మాత్రమే సొంత వాహనాలతో హైవేల మీదికి వచ్చేవారికి ఈ టోల్ ఫ్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌తో చెల్లించే ఫీజుల విషయంలో అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారు.. తమ ఫాస్ట్‌ట్యాగ్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. అందుకే.. మేము చెప్పే బెస్ట్ టిప్స్‌తో క్షణాల్లో మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
MyFastag యాప్ ద్వారా వాహనం నంబర్ ఎంటర్ చేసి ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI).. MyFastag అనే యాప్‌ను ప్రారంభించింది. ఇది IHMCL ఫాస్ట్‌ట్యాగ్‌లను కొనుగోలు చేయడం, ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేయడం, ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం సహా పలు రకాల ఫాస్టాగ్-సంబంధిత పనులను నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించే ఒక ప్రత్యేక యాప్.
- మొదట మీరు మీ Android లేదా IOS పరికరంలో MyFASTag యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఆ తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి.. మీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. (మీరు దీనికి ముందే లాగిన్ఐడీ, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి.)
- లాగిన్ అయ్యాక మీ వాహనం లైసెన్స్ ప్లేట్ నంబర్‌ను నమోదు చేయాలి.
- అంతే మీ వాహనం నంబర్‌తో అనుబంధించబడిన FASTag ఖాతాలోని బ్యాలెన్స్‌ని సింపుల్‌గా తనిఖీ చేయవచ్చు.
- MyFASTag యాప్ వివిధ రంగు కోడ్‌లను ఉపయోగించి FASTag బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
- ఉదాహరణకు మీ FASTag అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉంటే గ్రీన్ కలర్ సూచిస్తుంది.
- మీ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే నారింజ రంగు సూచిస్తుంది. అప్పుడు మీ FASTag ఖాతాను వీలైనంత త్వరగా రీఛార్జ్ చేయాలని అర్థం.
How to Recharge FASTag With Google Pay: ఇప్పుడు Gpayతో క్షణాల్లో ఫాస్టాగ్ రీఛార్జ్.. ట్రై చేశారా..?