How To Check Credit Score Using PAN Card : క్రెడిట్ స్కోర్ అనేది మన ఆర్థిక స్థితిగతులను, రుణాలు తీర్చగలిగే సామర్థ్యాన్ని తెలిపే ఒక కొలమానం. ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే మనకు రుణాలు ఇవ్వాలా? వద్దా? అనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. అంతేకాదు వడ్డీ రేట్లను కూడా ఈ క్రెడిట్ స్కోరే ప్రభావితం చేస్తుంది. అందుకే మన క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిది. దీని ద్వారా మన క్రెడిట్ స్కోర్ పడిపోకుండా జాగ్రత్త పడవచ్చు.
పాన్ కార్డ్ ద్వారా..
మన క్రెడిట్ స్కోర్‌ను చాలా సింపుల్‌గా పాన్ కార్డ్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్ 1 : ముందుగా మీ పాన్ కార్డ్‌ను సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే, ఈ కార్డులో ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, పాన్‌కార్డ్ నంబర్లను.. క్రెడిట్ స్కోర్ తెలిపే వెబ్సైట్లలో నమోదు చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 2 :భారతదేశంలో సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్వీఫాక్స్ లాంటి ఎన్నో క్రెడిట్ బ్యూరో సంస్థలు ఉన్నాయి. ఇవి క్రెడిట్ రిపోర్టులను అందిస్తూ ఉంటాయి. మీరు వీటిలో ఏ ఒక్కదాన్నైనా ఎంచుకోవచ్చు. కానీ మల్టిపుల్ వెబ్‌సైట్స్‌లో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల.. మన క్రెడిట్ హిస్టరీపై మరింత క్లారిటీ వస్తుంది.
స్టెప్ 3 : మీరు మీకు నచ్చిన క్రెడిట్ బ్యూరో వైబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ కచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆఫీషియల్ వెబ్‌సైట్స్‌ను మాత్రమే మీరు ఉపయోగించాలి. లేదంటే.. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది.