How to Change Name On Pan Card after Marriage :దేశంలో ఆధార్, క్రెడిట్, డెబిట్ కార్డుల మాదిరిగానే.. నిత్యం వాడే కార్డుల జాబితాలో పాన్‌కార్డు చేరిపోయింది. ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ ఈ కార్డు అత్యవసరంగా మారిపోయింది. గుర్తింపు కార్డుగా కూడా దీన్ని వాడుతుంటారు. అయితే.. పెళ్లికి ముందు పాన్ కార్డు ఉన్నవాళ్లు.. ఆ తర్వాత ఇంటి పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే దాని కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ ద్వారానే ఈజీగా పేరు మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వివాహం తర్వాత పాన్‌లో పేరు మార్చుకోవడానికి అవసరమైన పత్రాలివే..
- వివాహ ధృవీకరణ పత్రం/పెళ్లి పత్రిక
- అధికారిక గెజిట్‌లో పేరు మార్పు ప్రచురణ
- భర్త పేరు చూపించే పాస్‌పోర్ట్ కాపీ
- గెజిటెడ్ అధికారి జారీ చేసిన సర్టిఫికేట్ (దరఖాస్తుదారు పేరు మార్పు కోసం మాత్రమే)
How to Change Name in PAN Card after Marriage in Online :
మీ పాన్ కార్డ్‌లో ఈజీగా పేరు మార్చుకోండిలా..
- మొదట మీరు మొబైల్/డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో టీఐఎన్ ఎన్‌ఎస్‌డీఎల్ (www.tin-nsdl.com) అని టైప్ చేస్తే, దానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
- అప్పుడు దాంట్లో సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి PAN అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేసి.. Change/Correction in PAN Data అనే సెక్షన్‌లో అప్లయ్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం అక్కడ "Application Type" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
- దానిలో ‘Changes or Correction in existing PAN data’ని మీరు ఎంచుకోవాలి.
- ఆ తర్వాత పాన్ నంబర్ సహా పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందులో నమోదు చేయాలి.
- మీరు ఈ వివరాలన్నీ సబ్మిట్ చేశాక మీకు ఒక టోకెన్ నంబర్ జారీ చేస్తారు.
- అప్పుడు కింద ఉన్న బటన్‌పై క్లిక్ చేసి తర్వాతి ప్రక్రియకు వెళ్లాలి.
- ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించిన కరెక్షన్ పేజీ డిస్ప్లే మీద ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీ పేరు, పుట్టినరోజు, ఫోన్ నంబరు, ఇలా ఇక్కడ అన్నింటినీ మార్చుకొనే అవకాశం ఉంటుంది.
- ఆ తర్వాత సబ్మిట్ చేశాక మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన విధానంలో మీరు పేమెంట్ చేసే వెసులుబాటు అక్కడ ఉంటుంది.
- పేమెంట్ అయిన వెంటనే మీరు పాన్ కార్డును అప్‌డేట్ చేసినట్టుగా ఓ ఫారమ్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసి పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ప్రింటవుట్ తీసుకున్న ఫారమ్‌పై రెండు ఫొటోలు అతికించి దానిపై సంతకం చేయాలి.
- అలాగే పాన్ ఫారమ్‌లో పేరు మార్పుకు మద్దతు ఇవ్వడానికి స్వీయ-ధృవీకరించబడిన డాక్యుమెంట్ ప్రూఫ్‌ను జతచేయాలి.
- మీరు NSDL ద్వారా PAN కార్డ్‌లో మార్పు అప్లై చేస్తే.. ఆ దరఖాస్తును NSDLకి పోస్ట్ ద్వారా పంపాలి.
- అదే మీరు PAN కార్డ్ అప్లికేషన్‌లో పేరు మార్పు UTIITSL ద్వారా చేస్తే.. ఆ అప్లికేషన్‌ను UTIITSLకి పోస్ట్ ద్వారా పంపాలి.
- ఇలా ఈజీగా మీ పాన్‌కార్డులో పేరు మార్చుకోవచ్చు.
How to Get Duplicate PAN Card : పాన్ కార్డ్ పోయిందా ? సింపుల్‌గా ఇలా తీసుకోండి!
How to Check PAN Card Status in Telugu : పాన్ కార్డు దరఖాస్తు ఇలా.. స్టేటస్ అలా చెక్ చేయండి!
How to Check Pan Aadhaar Link Status : లాస్ట్ డేట్ ముగిసిపోయింది.. మీ పాన్-ఆధార్ లింక్ అయ్యిందా?