How to Update Name in LIC Policy in Telugu : ప్రముఖ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) తన వినియోగదారులకు అనేక రకాల ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులు ఇందులో పాలసీలు కలిగి ఉన్నారు. అయితే చాలామంది ఎల్ఐసీలో ఏదైనా పాలసీ ఓపెన్ చేసేటప్పుడు తమ పేరును ఏదైనా ఐడీ ప్రూఫ్ ప్రకారం కాకుండా తమకు నచ్చినవిధంగా నమోదు చేస్తుంటారు. మరికొన్ని కారణాల వల్ల కూడా వారు తీసుకునే పాలసీ పేరు విషయంలో కొన్ని తప్పులు దొర్లుతుంటాయి. అయితే ఇలాగే మీరు తీసుకున్న పాలసీలోనూ ఏదైనా పేరు విషయంలో ఏదైనా తప్పు ఉంటే ఒక్కోసారి మీరు పొందే ప్రయోజనాలు పొందకపోవచ్చు. అలాగే మీ తరఫుననామినీలు(Nominees) తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవలసి రావచ్చు. ఈ క్రమంలో మీరు కూడా ఎల్ఐసీలో ఏదైనా పాలసీ తీసుకుని ఇలాంటి పొరపాటే చేసి ఉంటే.. ఇప్పుడే మీ పేరును అప్డేట్ చేసుకోండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
LIC పాలసీ డాక్యుమెంట్‌లో పేరు మార్పుకు అనుమతించబడే పరిస్థితులు :
- ఒక స్త్రీ వివాహం అయిన తర్వాత తన ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటే.
- ఎవరైనా పిల్లలను దత్తత తీసుకున్న పరిస్థితులలో.
- పాలసీదారు జీవిత బీమా చట్టబద్ధంగా ఏదైనా కారణం వల్ల వారి పేరు/ఇంటిపేరులో కొన్ని మార్పులు చేస్తే.
- పాలసీదారు పేరు తప్పుగా ఉంటే
How to Change Name in LIC Policy :
LIC పాలసీలో పేరు మార్చుకునే విధానం..
- మొదటగా మీరు LIC పేరు మార్పునకు LIC బ్రాంచ్ మేనేజర్‌కు పేరు మార్పును అభ్యర్థిస్తూ అప్లికేషన్ రాయాలి.
- అందులో మీ సరైన పేరు, సంతకాన్ని పేర్కొనాలి. పేరు మార్పు కోసం మీరు క్రింద పేర్కొన్న పత్రాలను బీమా సంస్థకు సమర్పించాలి.
- గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించబడిన పేరు మార్పు పత్రాలు
- రోజువారీ ప్రాంతీయ వార్తాపత్రికలో ముద్రణ ప్రకటన
- మేజిస్ట్రేట్‌కు అధీకృత అఫిడవిట్, సమర్పించబడిన డిక్లరేషన్
- పాలసీదారు పేరుతో వివాహ ధృవీకరణ పత్రం
- దత్తత దస్తావేజు
- అవసరమైతే మీ నివాస రుజువు, ఫొటో ID, వయస్సు రుజువు మొదలైన ఇతర పత్రాలను సమర్పించాలి.
- మీరు ఏ కారణంగా పేరు మార్చు కుంటున్నారో దానికి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత, బీమా సంస్థ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ చేయబడుతుంది.
- పాలసీలో పేరు మార్పు కోసం పత్రాన్ని సమర్పించే సమయంలో LIC ద్వారా కొటేషన్ రుసుము వసూలు చేయబడుతుందని మీరు గమనించాలి.
LIC Policy Revival Process : మీ ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా?.. సింపుల్‌గా రివైవ్ చేసుకోండిలా!
Things to keep in mind in the LIC Policy Name Change Process