How To Change Mobile Number In SBI :ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్‌కు మొబైల్ నంబర్ లింక్ లేకుంటే.. ట్రాన్సాక్షన్ జరపడం చాలా కష్టం. అందుకే కచ్చితంగా బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. చాలా మంది తమ ఖాతాలకు మొబైల్ నంబర్ లింక్ చేసుకున్నప్పటికీ.. కొన్ని సార్లు కొత్త నంబర్ తీసుకోవడం చేస్తుంటారు. మరికొన్ని సార్లు స్వతహాగా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను మార్చాలనుకుంటారు. అటువంటి సమయంలోనే బ్యాంక్‌లో మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో ఫోన్ నంబర్‌ను ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్బీఐ బ్యాంక్‌లో ఫోన్ నెంబర్ మార్చుకోవడం ఎలా?
How To Update Mobile Number In SBI :దేశంలో ఎక్కువ మంది ఖాతాదారులున్న బ్యాంక్ ఎస్బీఐ. ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న ఖాతాదారు.. మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే దగ్గర్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ ఓ రిక్వెస్ట్ లెటర్‌ను ఫిల్ చేసి అధికారులకు ఇవ్వాలి. అయితే ఆ అకౌంట్ మీదేనన్న విషయాన్ని బ్యాంక్ అధికారులకు నిరూపించాల్సి ఉంటుంది. అందుకోసం మీకు సంబంధించిన కొన్ని ధ్రువపత్రాలను వారికి అందించాలి.
Documents Required To Change Mobile Number In Sbi Bank :ఈ క్రింది డాక్యుమెంట్లు చూపి బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ మార్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
- పాస్‌పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్స్
- ఓటర్ ఐడీ
- ఆధార్ కార్డ్
- MNREGA కార్డ్
- నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జారీ చేసిన లేఖ