How to Change Airtel DTH Mobile Number : రోజు రోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో.. ప్రతి రంగంలోనూ వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీవీల విషయానికి వస్తే.. బ్లాక్ అండ్ వైట్.. కలర్.. LCD, LED అంటూ.. డెవలప్ మెంట్ దూసుకెళ్తోంది. ఇప్పుడు సూపర్ స్మార్ట్ టీవీల(Smart TVs)యుగం నడుస్తోంది. టీవీ ప్రసారాల విషయంలోనూ ఇంతే.. యాంటీనా.. కేబుల్ దాటుకొని DTHల రాజ్యం నడుస్తోంది. తమ ఇంటి పైనే ఈ DTH(డైరెక్ట్ టు హోమ్ బ్రాడ్ కాస్టింగ్)ను ఏర్పాటు చేసుకుని స్మార్ట్ టీవీల్లో ప్రసారాలు వీక్షిస్తున్నారు జనం.
Change Airtel DTH Registered Mobile Number Process : వినియోగదారులు ఏ కంపెనీ DTH తీసుకున్నా.. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. మీరు Airtel DTH తీసుకున్నారనుకుందాం. ఫస్ట్ టైం మీ మొబైల్ నంబర్ ఇచ్చి.. ఆర్నెల్లో, ఏడాదో మీ టీవీ రీఛార్జ్ చేయిస్తారు. ఆ గడువు ముగిసిపోయింది. మళ్లీ రీఛార్జ్ చేయిద్దామంటే.. అప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్ కావాలి. కానీ.. ఏదో కారణంతో ఆ మొబైల్ నంబర్ ఇప్పుడు మీరు వాడట్లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలో మీకు తెలుసా? ఇక్కడ ఇదే విషయం వివరించబోతున్నాం. సింపుల్‌గా మీరు మరిచిపోయిన మొబైల్ నంబర్ గుర్తించవచ్చు. దాని స్థానంలో కొత్త నంబర్ యాడ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పాత టీవీలను స్మార్ట్టీవీలుగా మార్చుకునే ఛాన్స్.. రూ.1500లకే బంపర్ ఆఫర్
Airtel DTH మొబైల్ నంబర్ మార్చుకోండిలా..
How To Change Registered Mobile Number In Airtel DTH in Telugu :
- మొదట మీ మొబైల్ లో బ్రౌజర్‌ని తెరిచి Airtel అధికారిక వెబ్‌సైట్ https://www.airtel.in/airtel-update-rtn/digitaltv-rtnhomeను సందర్శించాలి.
- ఆ తర్వాత మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వడానికి మీ Airtel డిజిటల్ టీవీ కస్టమర్ IDని నమోదు చేయాలి.
- ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను తెలుసుకోవడానికి 2వ ఆప్షన్‌గా ఉన్న 'Registered Mobile Number' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీరు యాడ్ చేయాలనుకుంటున్న మీ కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
- తర్వాత వచ్చిన బాక్స్‌లో మీరు నమోదు చేసిన కొత్త నంబర్‌ను Confirm చేయాలి.
- అనంతరం దిగువన ఉన్న 'Change Mobile Number' అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నంబర్ మార్పు ప్రక్రియ కొనసాగుతుంది.
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి ఇచ్చిన వివరాలను Verify చేసుకోవాలి.
- 'Please Enter Your Pin Code', 'Please Enter Your Last Recharge Amount', 'Please Enter Your Last Recharge Month' వంటి మూడు వివరాలను మీరు వెరిఫై చేసుకోవాలి.
- చివరగా మీ రిజిస్టర్డ్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి 'Change Number' అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
- అంతే మీ Airtel DTHలో రిజిస్టర్ చేయబడిన పాత మొబైల్ నంబర్ మారిపోతుంది.
Airtel: మొబైల్+ డీటీహెచ్+ ఫైబర్.. ఒకే ప్లాన్‌లో అన్నీ!
Cheapest Airtel Prepaid Plan : ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. రూ.99 ప్లాన్‌తో అన్లిమిటెడ్ డేటా!