LIC E-Term Plan 2023 :ఎవరైనా జీవితంలో సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం జీవిత బీమా. మన ఆదాయానికి అనువైన పాలసీని ఎంచుకుని భవిష్యత్తును భద్రం చేసుకోవాలి. జీవితం అనేది అనిశ్చితితో కూడుకున్నది. అనుకోకుండా ఇంట్లో పెద్దకు లేదా ఇంకెవరికైనా జరగరానిది జరిగినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆర్థిక భరోసా కల్పిస్తాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ కవరేజీ అందించడం ఈ పాలసీల ప్రత్యేకత. ఎల్‌సీఐ అందిస్తున్న ఈ-టర్మ్ పాలసీ కూడా ఈ రకానికి చెందినదే. మిగతా టర్మ్ పాలసీల కంటే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. అసలుఎల్ఐసీ ఈ-టర్మ్ ప్లాన్(LIC E-Term Policy) తీసుకోవాలంటే ఏయే ఏయే అర్హతలు ఉండాలి, ఎంత ప్రీమియం చెల్లించాలి, ఈ టర్మ్ ప్లాన్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
LIC E-Term Plan 2023 Details :ఎల్ఐసీ ఈ-టర్మ్ పాలసీ కుటుంబానికి అవసరమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను ఎల్ఐసీ ఏజెంట్లు, మధ్యవర్తులు లేకుండా ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. మీ సొంత ఇంటి నుంచే ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసి సులభంగా నిర్వహించుకునే వెసులుబాటు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌కు కావాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
LIC E-Term Policy Eligibilities :
ఎల్ఐసీ ఈ-టర్మ్ పాలసీ అర్హతలిలా...
- దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. సాధారణ ఆదాయాన్ని కలిగి ఉండాలి.
- ఈ ప్లాన్‌కు అప్లై చేసుకోవాలంటే కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు. గరిష్ఠ వయస్సు 60 సంవత్సరాలు.
- ఈ ప్లాన్‌లో కనీస పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు.. గరిష్ఠ పాలసీ టర్మ్ 35 ఏళ్లు.
- కనీసం పది సంవత్సరాల పాటు ఈ పాలసీని కొనుగోలు చేయాలి. అలాగే ఏటా ప్రీమియంలు చెల్లించాలి.
- ఈ ప్లాన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 10(10)D కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.
- ఈ ప్లాన్‌లో ధూమపానం చేసేవారికి, చేయని వారికి భిన్నమైన ప్రీమియాలు ఉన్నాయి.
- NRIలు కూడా ఎల్ఐసీ ఈ-టర్మ్ ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి అర్హులు.
- పాలసీ వ్యవధి తప్పనిసరిగా 10 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
LIC E-Term Plan 2023 Features : LIC ఈ-టర్మ్ ప్లాన్ దాని అత్యంత ప్రసిద్ధ టర్మ్ బీమా పాలసీలలో ఒకటి. LIC ఈ-టర్మ్ ప్లాన్ అనేది స్వచ్ఛమైన బీమా పాలసీ. కుటుంబ సభ్యునికి మాత్రమే డెత్ బెనిఫిట్‌ను అందిస్తుంది. పాలసీదారు మరణించిన తర్వాత లబ్ధిదారునికి బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. పాలసీదారు ఎల్‌ఐసీ(LIC)ఈ-టర్మ్ ప్లాన్ కాల వ్యవధిలో జీవించి ఉంటే లబ్ధిదారుడు ఎటువంటి మెచ్యురిటీ బెనిఫిట్‌ను అందుకోరు. ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం చాలా సులభం. ఎలాంటి అవాంతరాలు లేని పాలసీగా చెప్పుకోవచ్చు. ఈ పాలసీలో సమ్ అష్యూర్డ్ పొగతాగనివారికి కనీసంగా 50లక్షలు, పొగతాగే వారికి 25లక్షలుగా ఉంది. అలాగే వార్షిక ప్రీమియం కనీసం రూ.2,875తో ప్రారంభమవుతుంది.
LIC E-Term Plan Benefits :
ఈ LIC E-టర్మ్ ప్లాన్ ద్వారా కలిగే ప్రయోజనాలివే..