How To Break Bad Money Habits : పైసా మే పరమాత్మ, ధనం మూలం ఇదం జగత్.. డబ్బు గురించి మనం తరచూ వినే మాటలు. ఇవి మన లైఫ్లో డబ్బు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో స్పష్టంగా తెలియజేస్తాయి. మన ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేకపోతే అప్పులపాలవడమే కాకుండా కష్టాల్లో పడతాం. అందుకే డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. కానీ, ఓ 5 రకాల అలవాట్లు మనల్ని ఆర్థికంగా అస్థిరపరుస్తాయి. ఆ అలవాట్లు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసకుందాం.
1. పరిమితికి మించి ఖర్చు చేయడం :కొంత మంది అవసరమైన దానికంటే అధికంగా ఖర్చులు చేస్తుంటారు. దీని వల్ల భవిష్యత్లో కచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఖర్చులను నియంత్రించుకునేందుకు.. బడ్జెట్ విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే క్రమశిక్షణతో ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి వీలవుతుంది. బడ్జెట్ లేకపోతే విచ్చలవిడిగా ఖర్చు చేసే ప్రమాదముంటుంది. దీనిని నివారించుకునేందుకు.. మీరు కచ్చితంగా నెలవారీ బడ్జెట్ను రూపొందించుకోవాలి. మీ ఆదాయం, ఖర్చుల వివరాల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దుబారా ఖర్చులను వీలైనంత వరకు తగ్గుంచుకోవాలి. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుని.. అందుకు అనుగుణంగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి.
2. భారీగా అప్పులు చేయడం :
మరికొంత మంది అవసరాల కోసం కాకుండా.. జల్సాల కోసం అప్పు చేస్తూ ఉంటారు. ఇది వారిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టివేస్తుంది. కనుక అనవసర విషయాల కోసం.. సాధ్యమైనంత వరకు అప్పు చేయకపోవడమే ఉత్తమం. కొందరు తాము తీసుకున్న రుణాలను, లేదా రుణ వాయిదాలను సకాలంలో చెల్లించరు. దీనితో పెనాల్టీలు, అధిక వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దీనితో క్రమంగా వారు అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. అందుకే తీసుకున్న అప్పును.. ఎలా పడితే అలా ఖర్చుచేయకుండా, సక్రమంగా వినియోగించుకోవాలి.
నేడు క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే.. తరువాత ఆర్థికంగా మీరే ఇబ్బంది పడతారు. అప్పుల ఊబిలోకి జారకుంటారు. అంతే కాదు మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. దీని వల్ల భవిష్యత్లో రుణాలు పొందే అవకాశం కూడా తగ్గుతుంది. అందుకే క్రెడిట్ కార్డులను అవసరాల కోసం మాత్రమే.. చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది.