How to Book Gas Cylinder by Google Pay:ఇంట్లో నిత్యావసరాల్లో ఏది ఉన్నా, లేకున్నా అడ్జెస్ట్ చేసుకోవచ్చునేమోగానీ.. గ్యాస్ సిలిండర్ లేకపోతే మాత్రం రోజు మొదలు కాదు. అన్ని పనులూ ఎక్కడివక్కడ స్తంభించిపోతాయి. స్కూలుకు వెళ్లే పిల్లలు.. ఆఫీసు, ఇతర ఉద్యోగాలకు వెళ్లె పెద్దలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే.. గ్యాస్ సిలిండర్ విషయంలో మహిళలు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉంటారు. ఎప్పుడు గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతుందో ఓ అంచనాకు వచ్చేస్తారు. పక్షం రోజుల ముందు నుంచే సిలిండర్ బుక్ చేసుకుంటారు.
అయితే.. గ్యాస్ బుకింగ్ లో సమస్య ఎదురవుతుంది. ఇంట్లో గ్యాస్ బుక్ ఎక్కడో ఉందో వెతుక్కోవడం.. అది దొరికిన తర్వాత రీఫిల్ బుకింగ్ కోసం సదరు గ్యాస్ కంపెనీకి ఫోన్ చేస్తే.. సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటివి ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో చాలా టెన్షన్ పడిపోతారు. అయితే.. ఇలాంటి ఆందోళన లేకుండా.. గూగుల్ పే నుంచి సులభంగా సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది.
How to Fix Google Pay Not Working : మీ "Google Pay" పనిచేయట్లేదా.. ఈ టిప్స్‌తో సింపుల్‌గా పరిష్కరించుకోండి!
Book LPG Cylinder By Using Google Pay:
- GPay ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసే విధానం..
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో GPay యాప్‌ని తెరవండి. - కిందకి స్క్రోల్ చేసిన తర్వాత బిల్లులు, రీఛార్జ్‌లు అనే కాలమ్ కనిపిస్తోందని. అక్కడ అన్నీ చూడండి(See All) నొక్కండి.
- చెల్లింపు కేటగిరీల విభాగంలో దిగువన ఉన్న గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- అందులో మీకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ సరఫరాదారుల కోసం సెర్చ్ చేసి దానిని ఎంచుకోండి.
- తర్వాత, మీ ఖాతా(Account)ను మొబైల్ నంబర్ లేదా LPG IDతో ఎంటర్ చేసి.. మరో బాక్స్‌లో మీ పేరు టైప్ చేయండి.
- అకౌంట్‌ను లింక్ చేసిన తర్వాత.. సిలిండర్ బుక్ చేసి.. బిల్లులు చెల్లించడం కొనసాగించండి.
- చెల్లింపు వివరాలను తనిఖీ చేసి.. GPay పిన్‌తో డబ్బులు చెల్లించి.. సింపిల్‌గా గ్యాస్ బుక్ చేసుకోని.. టెన్షన్ ఫ్రీ అవ్వండి.
Personal loan on Google Pay: మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా.. అయితే, మీకు లక్ష దాకా రుణం వచ్చేసినట్టే..!
How to Earn Google Opinion Rewards : గూగుల్ యాప్‌తో ఫ్రీగా డబ్బు.. 10 సెకన్లలోనే ఖాతాలోకి.. ఏం చేయాలంటే..