How To Book Flight Tickets At Low Price : అత్యంత సౌకర్యవంతమైన.. వేగవంతమైన ప్రయాణ మార్గం గురించి అడిగినప్పుడు.. చాలా మంది చెప్పేమాట.. విమాన ప్రయాణం. దూరంగా ఉన్న పర్యాటక ప్రదేశాలను చూసి రావడానికి సైతం.. డబ్బున్నవారు విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే.. చాలా మంది తమ జర్నీ బడ్జెట్‌లో.. సగానికి పైగా డబ్బులను విమాన టికెట్ల కోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే.. అతి తక్కువ ధరకే విమాన టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు! చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. చౌకగా విమాన టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Flight Ticket Booking Tips :చౌకైన విమాన టిక్కెట్‌లను బుక్ చేయడానికి 8 చిట్కాలు :
1. ముందుగానే బుక్ చేయండి :
విమాన ప్రయాణానికి టికెట్‌లను ప్రీ బుకింగ్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకుంటే.. ఎక్కడికి, ఏ తేదీన వెళ్లాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఒక సర్వే ప్రకారం విమాన ప్రయాణానికి 47 రోజుల ముందు ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేసుకుంటే.. చౌకగా టికెట్ లభిస్తుందని తేలింది. మరో సర్వేలో.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయం సరైందని వెల్లడైంది. అవసరమైతే తప్ప వీకెండ్స్‌లో విమాన టికెట్లు బుక్ చేయడంమానుకోండి. ఎందుకంటే ఇది పీక్ టైమ్. ఆ సమయంలో టికెట్ ధరలు పెరుగుతాయి.
2. ఏ రోజు ప్రయాణించాలో తెలివిగా ఎంచుకోండి..
చాలా మంది తమ ప్రయాణాన్ని శుక్ర, ఆదివారాల్లో జరిగేలా ప్లాన్ చేసుకుంటారు. ఇవి వీకెండ్ రోజులు కావడం వల్ల టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మీ ప్రయాణాన్ని మంగళ, బుధ, శనివారాల్లో జరిగేలా తెలివిగా మార్చుకోండి. ఈ మూడు రోజుల్లో ప్రయాణించడం ద్వారా తక్కువ ధరకే టికెట్ లభించే అవకాశం ఉంటుంది. దీపావళి, హోలీ, క్రిస్మస్ వంటి ప్రధాన పండగ సెలవు దినాలలో టిక్కెట్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
3. ఫ్లైట్ టికెట్ల కోసం వివిధ వెబ్‌సైట్‌లను చూడండి..
మీరు ఫ్లైట్ టికెట్ల కోసం ప్రతీసారి గూగుల్‌లో చూడకుండా వేరే సర్చ్ ఇంజిన్స్‌లో చూడండి. ఇక్కడ చౌకగా టికెట్‌లు దొరుకుతాయి. ప్రైస్‌లైన్(priceline), స్కైస్కానర్ (Skyscanner, Momondo, Kayak, Kiwi, Expedia) వంటి వెబ్‌సైట్‌లలో మీకు తక్కువ ధరకే టికెట్‌లు దొరుకుతాయి. మీ ప్రయాణం పక్కాగా జరుగుతుందనుకుంటే.. తిరిగి డబ్బులను చెల్లించని టికెట్‌ను బుక్ చేసుకోండి(non-refundable tickets).
4. తెల్లవారుజామున ప్రయాణించేలా చూసుకోండి..
మీరు వెళ్లాలనుకునే ప్రయాణాలను ఎప్పుడూ తెల్లవారుజామున ఉండేలా చూసుకోండి. పగలు నడిచే విమానాల కన్నా వేకువజామున నడిచే విమానాల టికెట్ ధరలు తక్కువగాఉంటాయి. కొన్ని సందర్భాల్లో తెల్లవారుజామున ప్రయాణం చేయడం వల్ల మీకు మంచి సీటు, అదనపు సౌకర్యాలు కలుగుతాయి. ఈ టైమ్‌లో విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కూడా తక్కుగా ఉంటుంది.