How to Become Millionaire With Daily Savings of Rs.500: కోటీశ్వరులు కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది..? అయితే.. కొందరు కేవలం కోరికతో వదిలిపెట్టకుండా.. దాన్ని సాధించుకోవడానికి కష్టపడతారు. కానీ.. ఎక్కడో సమస్య ఉంటుంది. దీనికి కారణం.. సరైన ఆర్థిక అవగాహన లేకపోవడమే అని చెబుతున్నారు నిపుణులు. సరైన ఆర్థిక సూత్రాలు తెలియకపోవడం వల్లనే డబ్బును వృద్ధి చేసుకోలేక పోతున్నారని.. కానీ దానికో సూత్రం ఉందంటున్నారు. మరి అది ఏంటి..? దానిని ఎలా ఉపయోగించాలి..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...
అపోహ వీడాలి..
కోటీశ్వరుడు కావాలంటే.. చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాలని అందరూ అనుకుంటారు. అయితే.. ఇది పూర్తి నిజం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. తక్కువ డబ్బుతో.. సరైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల త్వరగా ధనవంతులు కావచ్చంటున్నారు. ఇందుకోసం ముందుగా 15*15*15 సూత్రం గురించి తెలుసుకోవాలట!
15*15*15 నియమం ఏమిటి..?:భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా రిటర్న్స్ కావాలని అనుకుని.. ఎస్ఐపీలను ఎంచుకుంటున్నారు. పైగా దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టే వారు దీని నుంచి ఖచ్చితంగా మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మెరుగైన రాబడులను పొందొచ్చు.
సిస్టమేటిక్ ఇన్వెస్మెంట్ ప్లాన్(SIP) రూపంలో చాలా మంది పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి ఒక ఫార్ములా ఉంది. అదే చాలా ఫేమస్ అయిన 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం ఏమిటంటే ఎవరైనా పెట్టుబడిదారుడు నెలకు 15వేల రూపాయల చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వారు ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారతారు. దీని వెనుక కాంపౌండింగ్ ఫార్మాలా అతి పెద్ద మ్యాజిక్ చేస్తోంది. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు ఈ ఫార్ములా కింద రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోంతుందన్న మాట.