తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Become Millionaire : 15వేల రూపాయలతో కోటీశ్వరులు కావొచ్చు.. ఈ సూత్రం తెలుసా..?

How to Become Millionaire New Investment Ideas: కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా..? సంపాదించిన డబ్బు చేతిలో ఆగడం లేదా..? అయితే.. మీ కోసమే ఈ సూత్రం! దీన్ని ఫాలో అయిపోండి. మీ కలను నిజం చేసుకోండి.

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 2:27 PM IST

How to Become Millionaire
How to Become Millionaire

How to Become Millionaire New Investment Ideas: కోటీశ్వరులు కావాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి? అయితే.. కొందరు కేవలం కోరికతో వదిలిపెట్టరు. దాన్ని సాధించుకోవడానికి కూడా కష్టపడతారు. కానీ.. ఎక్కడో లోపం ఉంటుంది. సంపాదించిన డబ్బు మొత్తం తెలియకుండానే ఖర్చైపోతుంది. సరైన ఆర్థిక అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు నిపుణులు. సరైన ఆర్థిక సూత్రాలు తెలియకపోవడం వల్లనే డబ్బును వృద్ధి చేసుకోలేకపోతున్నారని అంటున్నారు. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం.

అపోహ వీడాలి..
కోటీశ్వరుడు కావాలంటే.. చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాలని అందరూ అనుకుంటారు. అయితే.. ఇది పూర్తి నిజం కాదని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రతినెలా తమకు వచ్చే సంపాదనలో.. కొంత డబ్బు సరైన రీతిలో ఆదా చేస్తే.. ఎవరైనా ధనవంతులు కావచ్చని చెబుతున్నారు. అయితే.. డబ్బు ఆదా చేయడానికి చాలా మార్గాలుఉన్నప్పటికీ.. దానికి సరైన ఏంటనేది కూడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. సరైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల త్వరగా ధనవంతులు కావచ్చంటున్నారు. ఇందుకోసం ముందుగా 50*30*20 సూత్రం గురించి తెలుసుకోవాలట!

ఒక్క ఐడియాతో వారి జీవితం సూపర్ హిట్​

50*30*20 నియమం ఏమిటి..?:డబ్బు సంపాదించడం వేరు.. దాన్ని రొటేషన్​ చేయడం వేరు. డబ్బు రొటేషన్ అన్నది.. సంపాదించినంత సులభం కాదంటారు నిపుణులు. కొంత మందికి తెలిసినా.. ఎక్కడ ప్రారంభించాలో అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో 50*30*20 నియమం చాలా ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. డబ్బును ఆదా చేసుకోవడానికి ఇదొక గొప్ప మార్గం. ఈ నియమం ప్రకారం.. ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఆదాయంలో 50 శాతాన్ని ఇంటి రెంట్,​ కిరాణా, రవాణా వంటి అవసరాలకు ఖర్చు చేయాలి. ఇదే సమయంలో బయటి ఫుడ్​ తినడం, వినోదం, షాపింగ్ వంటి అవసరాల కోసం 30 శాతం కేటాయించాలి. మిగిలిన 20 శాతాన్ని భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగించాలి.

SIP పెట్టుబడులు :50*30*20 నియమం మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తుంది. అలాగే మీ పొదుపును కూడా పెంచుతుంది. ఆదాయంలో మిగిలిన 20 శాతాన్ని SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(Systematic Investment Plan). ఇందులో ఎలాంటి భారం ఉండదు. దీర్ఘకాలంలో రాబడులు కూడా చాలా బాగుంటాయి. 15 సంవత్సరాల పాటు సంవత్సరానికి 15% చొప్పున ప్రతి నెలా 15 వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. దాదాపు అది 27 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపై వడ్డీ ఆదాయం కూడా లక్షల్లో ఉంటుంది. ఇలా.. పెట్టుబడి పెడుతూ వెళ్తే.. కోటీశ్వరులు కావడం అనేది.. అసాధ్యమేమీ కాదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. విన్నారు కదా..! మరి, ఈ ప్లాన్ మీక్కూడా నచ్చితే.. వెంటనే ఫాలో అవ్వండి. కోటీశ్వరులు కావాలనుకునే మీ కోరికను నెరవేర్చుకోండి.

కొత్త మదుపరులకు కరోనా తెచ్చిన అవకాశం!

ABOUT THE AUTHOR

...view details