How to be Safe from Google Pay Online Frauds :మనీ ట్రాన్స్ఫర్ కోసం.. చాలా మంది UPI యాప్స్ ఉపయోగిస్తున్నారా..? అయితే.. ఈ పద్ధతి వల్ల పలువురు నిలువునా మోసపోతున్నారు కూడా. మరి అలాంటి నష్టాల బారిన పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి..? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
UPI మోసాల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి?:
How to Stay Safe from UPI Frauds :
- మీ పాస్వర్డ్ ప్రైవేట్‌గా ఉంచుకోవాలి. దాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
- సురక్షితంగా అనిపించకపోతే.. అక్కడ యూపీఐ వినియోగించకపోవడమే మంచిది.
- మీకు తెలియని వ్యక్తులకు చెల్లింపులు చేయకండి.
- తెలియని సందేశాలు, లింక్‌లు ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపిస్తారు. వాటిని ఓపెన్ చేయవద్దు. వాటిని డెలిట్ చేయండి.
- స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి. ఈజీగా ఉంటే.. హ్యాక్ చేసే అవకాశం ఉంది.
- మీరు సురక్షితంగా ఉండటానికి ప్రతి నెలా ఒకసారి పాస్‌వర్డ్‌ను మార్చడం అలవాటు చేసుకోవాలి.
- ఇతర మొబైల్ యాప్‌లలో.. మీ UPI పాస్‌వర్డ్‌ను ఉపయోగించకండి.
- నిత్యం యాప్‌ను అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు(Don't Forget to Update your App). అప్‌డేట్ చేయకపోతే హ్యాక్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
- హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు(Do Not Download Malicious Software)
- UPIకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి "ప్రత్యేక యాప్"ని డౌన్‌లోడ్ చేయమని స్కామర్‌లు మిమ్మల్ని అడగవచ్చు. ఇలాంటి డౌన్‌లోడ్ చేయొద్దు.
- నకిలీ హెల్ప్‌లైన్ నంబర్‌ల పట్ల జాగ్రత్త వహించండి(Beware of Fake Helpline Numbers)
- Play Store నుంచి అధికారిక యాప్‌ను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.