SBI Amrit Kalash Scheme :నేటి ఆధునిక కాలంలో ఎంత సంపాదిస్తున్నామో అంతే మొత్తంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు చేయాలి. ఈ క్రమంలో పొదుపు పథకాల్లో ఒకటైన ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposit)ప్రజల నమ్మకాన్ని బాగా చూరగొంది. ముఖ్యంగా మన దేశంలో ఈ ఎఫ్డీలపై వినియోగదారులకు అపార నమ్మకం ఉంది. అధిక వడ్డీని అందించడంతో పాటు సురక్షిత పెట్టుబడి పథకం కావడంతో దీనిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచాయి.
Amrit Kalash Deposit Scheme :ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) సరికొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకటైన ఎస్బీఐ 'అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం' చాలా పాపులర్ అయింది. ఈ క్రమంలో ఆ పథకం గడువు ఆగస్టు15తో రెండోసారి ముగిసింది. తాజాగా మరోసారి ఎస్బీఐ కీలక ప్రకటన చేస్తూ తన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు మరోసారి పొడిగిస్తూ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకానికి ఎవరెవరూ అప్లై చేసుకోవచ్చు? దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఎప్పటి వరకు ఈ స్కీమ్ గడువు పెంచింది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SBI Amrit Kalash Scheme Details : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ కస్టమర్ల కోసం 2023 ఏప్రిల్ 12న 'అమృత్ కలశ్ స్కీమ్' అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. తొలుత కొద్దిరోజులు మాత్రమే ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత.. మొదటిసారి జూన్ 30వరకు పొడిగించింది. అనంతరం.. రెండోసారి ఆగస్ట్ 15వ తేదీ వరకు పెంచింది. తాజాగా మూడోసారి డిసెంబర్ 31, 2023 వరకు గడువు పెంచుతున్నట్లు ఎస్బీఐ తన అధికారిక వైబ్సైట్లో పేర్కొంది. అప్పటివరకు ఈ స్కీమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. 400 రోజుల టైమ్ పీరియడ్‌తో తీసుకొచ్చిన ఎస్బీఐ "అమృత్ కలశ్" పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
"అమృత్ కలశ్" స్కీమ్ కోసం అప్లై (How to Apply Amrit Kalash Scheme) చేసుకోవడం ఎలా..?
- మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఏ ఎస్బీఐ బ్రాంచ్‌కైనా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఒకవేళ మీకు దగ్గరలో బ్యాంక్ లేకపోతే ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్(SBI Yono App) ద్వారా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
- ఈ పథకం ద్వారా రూ. 2 కోట్ల వరకు డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది.
SBI Fixed Deposit Rates 2023 : ఎస్బీఐ వీ కేర్ Vs అమృత్ కలశ్.. ఏది బెస్ట్ ఆప్షన్?
అమృత్ కలశ్ స్కీమ్ బెనిఫిట్స్(Amrit Kalash Scheme Benefits)..
1. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం పొందాలనే వారికి ఈ ఎఫ్డీ స్కీమ్ చాలా అనువైన పథకం.
2. ఈ పథకం ద్వారా ముందస్తుగా డిపాజిట్లనూ ఉపసంహరించుకునే వీలు ఉంటుంది.
3. అదేవిధంగా లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.