తెలంగాణ

telangana

ETV Bharat / business

కారు కొనడానికి లోన్‌ కావాలా? తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ రుణం! ఈజీ ఈఎంఐ - కారు లోన్‌ ఎస్‌బీఐ నుంచి ఎలా పొందాలి

How To Apply For SBI Car Loan : మీరు దీపావళి సందర్భంగా కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. కారు కొనాలనుకునే వారికి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఏంటి..? లోన్‌ కాల వ్యవధి ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Apply For SBI Car Loan
How To Apply For SBI Car Loan

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 12:51 PM IST

How To Apply For SBI Car Loan :పండగల సమయంలోకొత్త కారు కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగానే వాహన సంస్థలు కూడా ఈ సమయంలోనే.. కొత్త కొత్త మోడళ్లను తీసుకువస్తుంటాయి. కానీ, లక్షల రూపాయలు ఒకేసారి వెచ్చించి కారును కొనడం అందరికీ వీలుకాకపోవచ్చు. వారి కోసమే అతి తక్కువ వడ్డీకి ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు రుణాలను అందిస్తోంది. ఈ కారు లోన్‌ను తిరిగి చెల్లించేందుకు కూడా సుమారు 7 సంవత్సరాల సమయాన్ని ఎస్‌బీఐ కల్పిస్తోంది. ఈ కారు లోన్‌ను పొందడానికి ఎవరు అర్హులు? వడ్డీ రేటు ఎంత ఉంటుంది? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

SBI కార్ లోన్ పొందేందకు ఎవరు అర్హులు ?

  • కారు లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయస్సు 21 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
  • దరఖాస్తుదారుడు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి (లేదా) స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తి (లేదా) వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు కలిగిన వ్యక్తి కారు లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI కార్ లోన్ ముఖ్యాంశాలు..

  • EMIలను చెల్లించడానికి 7 సంవత్సరాల వ్యవధి.
  • రోజువారీగా తగ్గిన బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కిస్తారు.
  • అడ్వాన్స్ ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు.
  • SBI నుంచి ఆప్షనల్‌ జీవిత బీమా కవరేజీ.
  • కారు ఆన్ రోడ్ ప్రైస్‌ పై ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని అందిస్తారు.

కార్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలు..
ఎస్‌బీఐ కారు లోన్‌ దరఖాస్తుదారులకు 8.65 శాతం నుంచి 14.75 శాతం వరకు వడ్డీ రేటుతో రుణాలను అందిస్తుంది.

మీకు కారు లోన్‌ ఇచ్చేముందు బ్యాంకులు మీ ఆదాయం, అప్పుల నిష్పత్తిని పరిశీలిస్తాయి.

గతంలో మీరు తీసుకున్న అప్పులకు సకాలంలో EMIలను చెల్లించారా లేదా? అనేది పరిగణనలోకి తీసుకొని వడ్డీని నిర్ణయిస్తాయి.

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచితే కారు EMI కూడా పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది.

కాబట్టి, కారు లోన్‌ తీసుకునే ముందు ఒకసారి మార్కెట్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోండి.

వాహనం వయస్సు..
మీరు కారు రుణాన్ని తీసుకున్నప్పుడు, ఆ వాహనం బ్యాంకుకుమొత్తం రుణ కాలవ్యవధి ముగిసే వరకు పూచీకత్తుగా ఉంటుంది. ఒకవేళ ఈఎంఐ చెల్లింపులను చేయకపోతే వాహనం తీసుకెళ్తారు. కారు లోన్‌ వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు బ్యాంకులు వాహనం మోడల్‌, వయస్సును పరిగణనలోకి తీసుకుంటాయి.

Car Buying Tips : కొత్త కారు కొనాలా? లేక పాతదా? ఏది బెటర్​ ఆప్షన్​?

దరఖాస్తుదారుడి ఆదాయం, వృత్తి..
కారు వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు బ్యాంకులు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్‌తోపాటు అతని ఆదాయం, చేసే వృత్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. సాధారణంగా బ్యాంకులు స్థిరమైన ఆదాయం కలిగిన వారికి లోన్‌లను ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

SBI కార్ లోన్ కోసం అర్హతను ఎలా పెంచుకోవాలి..?

  • సులభంగా ఎస్‌బీఐ కారు లోన్‌ను పొందడానికి మంచి క్రెడిట్‌ స్కోర్‌ను మెయింటెన్‌ చేయండి.
  • కారు లోన్‌నుతిరిగి చెల్లించడానికి తక్కువ కాల వ్యవధిని ఎంపిక చేసుకోండి. దీనివల్ల లోన్‌ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.
  • కారు లోన్‌ కోసం తక్కువ అమౌంట్‌ను అడిగితే తొందరగా రుణం అందుతుంది. దీనివల్ల లోన్‌ మొత్తంపై తక్కువ వడ్డీ రేటు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి ?

  • SBI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి కారు లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • బ్యాంక్ మీరు సమర్పించిన డాక్యుమెంట్స్‌ అన్ని సరైనవని సంతృప్తి చెందిన తరవాత లోన్‌ వస్తుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కారు లోన్ కోసం కావాల్సిన పత్రాలు..

  • గత 6 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్.
  • 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు.
  • అడ్రస్ ప్రూఫ్.
  • పే స్లిప్‌లు, ఫారం 16.
  • 2 సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్స్న్.
  • గుర్తింపు కార్డు.

వ్యాపారవేత్తలు లేదా జీతం లేనివారు..

  • గత 6 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్.
  • 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
  • అడ్రస్ ప్రూఫ్.
  • గుర్తింపు కార్డు.
  • 2 సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్స్న్.
  • ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్.
  • సేల్స్ ట్యాక్స్ సర్టిఫికెట్.
  • భాగస్వామి(భర్త లేదా భార్య) వివరాలు.
  • 2 సంవత్సరాలకు P&L స్టేట్‌మెంట్.

వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వ్యక్తులు..

  • గత 6 నెలల బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్.
  • 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
  • అడ్రస్ ప్రూఫ్.
  • గుర్తింపు కార్డు.
  • వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన రుజువుల వివరాలు.
  • వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు (పౌల్ట్రీ, డెయిరీ, ప్లాంటేషన్, హార్టికల్చర్) సంబంధించి రుజువులను తప్పనిసరిగా అందించాలి.

Car Loan Precautions : కార్​ లోన్ కావాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే తక్కువ వడ్డీతో.. లోన్ గ్యారెంటీ!

All bank car loan interest 2023 : కారు లోన్​ తీసుకోవాలా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు అంటే..

ABOUT THE AUTHOR

...view details