తెలంగాణ

telangana

ETV Bharat / business

Pradhan Mantri Vaya Vandana Yojana: వృద్ధాప్యంలో ఆదాయం కోసం.. కేంద్రం పాలసీ.. మీకు తెలుసా?

How To Apply for PMVVY Scheme : మీ ఇంట్లో 60 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు ఉన్నారా? అయితే మీకో శుభవార్త.. వృద్ధాప్యంలో వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పింఛను పథకాన్ని ప్రారంభించింది. మరి, ఆ పాలసీ వివరాలేంటో తెలుసుకోండి.

How To Apply for PMVVY Scheme
Pradhan Mantri Vaya Vandana Yojana

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 5:19 PM IST

What Are The Benefits Of PMVVY : వృద్ధులకు సామాజికంగా, ఆర్థికంగా భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)' అనే పేరుతో పింఛను పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 60 ఏళ్లు దాటి, ఆర్థికంగా ఇబ్బంది పడేవారికోసం.. నిర్దిష్ట ప్రమాణాలతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ద్వారా దీన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మరి, ఈ పథకానికి అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేయాలి..? ఏయే పత్రాలు సమర్పించాలి..? ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే వివరాలను తెలుసుకుందాం.

పీఎంవీవీవైలో చేరడానికి ఉండాల్సిన అర్హతలు..
Eligibility for Joining PMVVY..

  • కనిష్ట వయస్సు 60ఏళ్లు దాటి ఉండాలి.
  • గరిష్ట వయస్సుపై పరిమితి లేదు.
  • పాలసీ కాలవ్యవధి 10 సంవత్సరాలు.
  • ఒక్కో సీనియర్ సిటిజన్‌ రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
  • కనీస పెన్షన్ నెలకు రూ.1,000..
  • (మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకి రూ.6,000, సంవత్సరానికి రూ. 12,000)
  • గరిష్ట పెన్షన్ నెలకు రూ.12,000..
  • (మూడు నెలలకి రూ.30,000, ఆరు నెలలకి రూ.60,000, సంవత్సరానికి రూ.1,20,000)

పదవీ విరమణ తర్వాత ఏడాది వరకూ తాత్కాలిక పింఛను

పీఎంవీవీవైకి సమర్పించాల్సిన పత్రాలు
Which Documents To Submit To PMVVY :

  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • బ్యాంక్ పాస్ బుక్
  • ఇంటి చిరునామా పత్రం
  • ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ప్రధాన మంత్రి వయ వందన యోజన ప్రయోజనాలు
What Are The Benefits Of PMVVY?:

  • పాలసీ కాల వ్యవధి 10 ఏళ్లు.
  • ఈ పథకం ద్వారా పెన్షన్‌ను నెలవారీగా, 3 నెలలు, 6 నెలలకి అందుకోవచ్చు.
  • పెన్షనర్ పాలసీ వ్యవధిలోపు మరణిస్తే పాలసీ కొనుగోలు ధరను పూర్తిగా నామినీకి చెల్లిస్తారు.
  • ఈ పెన్షన్ స్కీమ్‌ని ఎంచుకున్న వ్యక్తులు.. పాలసీ వ్యవధి ముగిసేలోపు మొత్తాన్ని సంపాదించడానికి అర్హులవుతారు.
  • పాలసీని కొనుగోలు చేసిన తర్వాత వ్యక్తులు సంతృప్తి చెందకపోతే, కొనుగోలు తేదీ నుండి 30 రోజులలోపు నిష్క్రమించవచ్చు.
  • మూడేళ్లు ముగిసిన తర్వాత పాలసీపై పింఛనుదారుడు రుణం తీసుకునేందుకు అర్హత లభిస్తుంది.
  • పాలసీ కొనుగోలు మొత్తంలో 75 శాతం వరకు రుణం పొందొచ్చు. వడ్డీని పింఛను మొత్తం నుంచి వసూలు చేసుకొంటారు.
  • పాలసీ కొనుగోలు చేసిన తర్వాతి నెల నుంచే పింఛను అందడం మొదలవుతుంది.

How to Buy LIC E-Term Policy in Online : ఆన్​లైన్​లో ఎల్​ఐసీ ఈ-టర్మ్​ పాలసీ.. ప్రయోజనాలేంటో తెలుసా?

LIC Aadhaar Shila Policy : ఎల్​ఐసీ 'సూపర్​ పాలసీ'.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు విత్​డ్రా!

ABOUT THE AUTHOR

...view details