How to Apply for Aadhaar Card Center in Telugu :మీరు ఏదైనా బిజినెస్(Business)పెట్టాలని చూస్తున్నారా? అయితే.. నేరుంగా ప్రభుత్వంతోనే మీరు వ్యాపారం చేయొచ్చు. దీనికోసం ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే.. ఎలాంటి సమస్యలనూ ఎందుర్కొవాల్సిన అవసరం లేదు. అదే.. ఆధార్ బిజినెస్. మరి, దీని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar Card Franchise Application Process :ఇప్పుడు దేశంలోని ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఆధార్ అత్యంత ప్రధానమైనదిగా మారిపోయింది. దీని ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి నుంచి బ్యాంకులు, కళాశాలలు, రేషన్ షాపులు ఇలా ప్రతిదగ్గర అందరికీ ఆధార్ కార్డ్ (Aadhaar card)అవసరం పడుతోంది. అలాగే ఎలాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు పొందాలన్నా.. ఇది తప్పనిసరి. ఇలా రోజువారీ జీవితంలో ఏ పని చేయాలనుకున్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఈ క్రమంలో మీరు ఆధార్ కార్డు ఫ్రాంచైజీ తీసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే నెలలో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. పైగా ఎలాంటి సెక్యూరిటీడిపాజిట్లు(Deposits), ముందస్తు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మరి, ఈ ఫ్రాంఛైజీని ఎలా సాధించాలి..? అన్నది చూద్దాం.
How to Get Aadhaar Card Franchise :మీరు ఆధార్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే.. మొదట దీని కోసం మీరు UIDAIనిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించడానికి లైసెన్స్ ఇస్తారు. అప్పుడు మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. దీని తర్వాత.. కామన్ సర్వీస్ సెంటర్ నుంచి రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఇక ఆధార్ ఫ్రాంచైజీ పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
How to Download Masked Aadhaar Card Online : ముఖానికి సరే.. ఆధార్‌కు మాస్క్ తగిలించారా..? లేకపోతే...