How Much Money You Can Withdraw from Provident Fund :ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి దాదాపుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఉంటుంది. ప్రతినెలా వారి ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. అలాగే.. వారి యజమాని కూడా అంతే మొత్తాన్ని ఆ ఉద్యోగుల అకౌంట్‌కు జమ చేస్తారు. ఉద్యోగ విరమణ తరువాత.. ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ డబ్బు ఉపయోపగడుతుందన్నది ఉద్దేశ్యం. కానీ.. కొందరికి పరిస్థితుల కారణంగా అత్యవసరంగా డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి వారు రిటైర్‌మెంట్ కంటే ముందే పీఎఫ్ డబ్బులను(PF Advance Withdrawal)విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ.. మొత్తం డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. సందర్భాన్ని బట్టి ఉద్యోగులు కొంత శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏ సందర్భంలో ఎంత శాతం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
How to EPF Advance Withdrawal in Telugu :సాధారణంగా ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని ఉద్యోగ విరమణ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత తీసుకుంటుంటారు. అదే మీరు రిటైర్‌మెంట్ కంటే ఒక సంవత్సరం ముందు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలనుకుంటే.. 90శాతం డబ్బు తీసుకోవచ్చు. మీరు మధ్యలో ఉద్యోగం మానేస్తే.. ఒక నెల నిరుద్యోగం తర్వాత 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇవి రెండు సందర్భాలు కాకుండా.. మిగిలిన సందర్భాల్లో మీరు కొంతమేర డబ్బును ప్రావిడెంట్ ఫండ్(PF)నుంచి ఉపసంహరించుకోవచ్చు.
మీరు పీఎఫ్ నుంచి నగదు తీసుకోవాలంటే UAN నంబర్ కరెక్ట్‌గా ఉండాలి. అలాగే.. మీ యూఏఎన్‌కు ఆధార్, పాన్‌కార్డుతో సహా బ్యాంకు వివరాలన్నీ తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి.
బేసిక్+డీఏ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ EPF మొత్తంలో 75% కంటే ఎక్కువగా విత్‌డ్రా చేయలేరు. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారందరికీ ఇది వర్తిస్తుంది.
EPF మొత్తంలో గరిష్ఠంగా 75% లేదా మూడు నెలల బేసిక్+డీఏ.. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.