తెలంగాణ

telangana

ETV Bharat / business

హాట్‌స్టార్‌ సర్వర్​ డౌన్.. నెటిజన్ల ఫైర్.. స్క్రీన్‌షాట్స్​తో ట్రోల్స్​ - డిస్నీ హాట్‌స్టార్ సేవలకు అంతరాయం

భారత్​లో డిస్నీ+ హాట్‌స్టార్‌.. సర్వర్​ డౌన్​ అయింది. దీంతో దేశవ్యాప్తంగా వీటి సేవలకు అంతరాయం కలిగింది. దీనిపై వినియోగదారులు సోషల్​ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఎర్రర్ మెసేజ్​లను స్క్రీన్‌షాట్‌లు తీసి​ షేర్​ చేస్తున్నారు.

hotstar-server-down-across-india
భారత్​లో డిస్నీ హాట్‌స్టార్‌ సర్వర్​ డౌన్

By

Published : Feb 17, 2023, 3:34 PM IST

Updated : Feb 17, 2023, 3:51 PM IST

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలకు అంతరాయం కలిగింది. భారత్​లోని పలు పట్టణాల్లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సర్వర్​ డౌన్​ అయింది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఈ అంతరాయంపై.. సోషల్​మీడియా వేదికగా వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. లాగిన్ చేసే సమయంలో వస్తున్న ఎర్రర్ మెసేజ్​ను.. స్క్రీన్‌షాట్‌లు తీసి ట్విటర్​లో షేర్​ చేస్తున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ అంతరాయం కలిగినట్లు చెబుతున్నారు.

దీనిపై ఇప్పటివరకు 500 మంది భారత వినియోగదారులు ఫిర్యాదు చేశారని డౌన్‌డిటెక్టర్‌.కామ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. దిల్లీ, జైపుర్​, లఖ్​నవూ, కోల్​కతా, నాగ్​పుర్​, హైదరాబాద్​, ముంబయి సహా మరికొన్ని చోట్ల డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలిసింది. తమ సేవల్లో అంతరాయంపై డిస్నీ+ హాట్‌స్టార్‌ స్పందించింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. తమ యాప్​, వెబ్​సైట్లలో ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొంది. సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది.

Last Updated : Feb 17, 2023, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details