తెలంగాణ

telangana

ETV Bharat / business

Honda New Bike Launch : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్ లాంఛ్​.. బడ్జెట్​ ధరలోనే! - లేటెస్ట్ బైక్స్ 2023

Honda New Bike Launch News In Telugu : హోండా మోటార్​ సైకిల్ అండ్ స్కూటర్​ ఇండియా కంపెనీ.. శుక్రవారం ఇండియన్​ మార్కెట్​లో సీడీ110 డ్రీమ్​ డీలక్స్ బైక్​ను లాంఛ్​ చేసింది. మంచి స్టైలిష్​ లుక్​తో, అదిరే ఫీచర్లు ఉన్న ఈ బైక్​ను బడ్జెట్​ ధరలోనే అందిస్తోంది హోండా. మరి ఈ లేటెస్ట్ బైక్ వేరియంట్స్​,​ ఫీచర్స్, ధర​ వివరాలపై మనమూ ఓ లుక్కేద్దామా?

Honda CD110 Dream Deluxe Launched In India
Honda New Bike Launch

By

Published : Aug 11, 2023, 5:01 PM IST

Updated : Aug 11, 2023, 5:22 PM IST

Honda New Bike Launch : ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా.. 'సీడీ100 డ్రీమ్​ డీలక్స్'​ పేరుతో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్​లో లాంఛ్ చేసింది. మంచి స్టన్నింగ్​ లుక్స్​తో, అదిరే ఫీచర్లతో, అందుబాటు ధరలో దీనిని తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్​ మోటార్ సైకిల్​ సెగ్మెంట్​లో తీసుకొచ్చిన ఈ హోండా బైక్​పై 10 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తున్నారు. ఇందులో 3 సంవత్సరాల స్టాండర్డ్​ వారంటీ + 7 సంవత్సరాల ఆప్షనల్​ ఎక్స్​టెండెడ్​ వారంటీ కూడా అందిస్తున్నారు.

హోండా సీడీ110 డ్రీమ్ డీలక్స్​ ఫీచర్స్​
Honda CD110 Dream Deluxe Features :హోండా సీడీ100 డ్రీమ్​ డీలక్స్​ బైక్​లో 4-స్ట్రోక్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంది. దీనిని హోండా eSP సాంకేతికతో, BS6 స్టేజ్​ 2 నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ 109.51 సీసీ ఎయిర్-​కూల్డ్​ ఇంజిన్​ 7,500 ఆర్​పీఎం వద్ద 8.67 బీహెచ్​పీ పవర్​, 5,500 ఆర్​పీఎం వద్ద 9.30 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సైకిల్..​ ఆటో-చోక్​ పంక్షనాలిటీతో వస్తుంది. అలాగే దీనిలో ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​ స్విచ్​ కూడా ఉంది. దీనిలో కాంబి-బ్రేక్​ సిస్టమ్​, హాలోజన్​ లైటింగ్ ఉన్నాయి. ఈ బైక్​లో పొడవైన సింగిల్​-పీస్​ సీటు ఉంది. దీని ఎత్తు 720మి.మీ ఉంటుంది.

హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​లో 4-స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంది. ఈ బైక్​ కిక్​ స్టార్టర్​తోపాటు సెల్ఫ్​ స్టార్టర్​తో వస్తుంది. ఈ హోండా బైక్​లో.. 18 అంగుళాల వ్యాసంతో ట్యూబ్​లైస్ టైర్​లు ఉన్నాయి. అలాగే వీటిలో డైమండ్​ సేప్ ఫ్రేమ్ ముందు భాగంలో టెలిస్కోపిక్​ ఫోర్కులు, వెనుక వైపు హైడ్రాలిక్​ ట్విన్​ షాక్​ అబ్జార్బర్లు ఉంటాయి. ఈ మోటార్​ సైకిల్​.. సైడ్​ స్టాండ్​ ఇండికేటర్​, కంబైన్డ్​ బ్రేకింగ్ సిస్టమ్​తో వస్తుంది.

కలర్​ వేరియంట్స్​
Honda CD110 Dream Deluxe Variants :హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​ బైక్​.. బ్లాక్​ విత్​ రెడ్​, బ్లాక్ విత్​ బ్లూ, బ్లాక్​ విత్ గ్రీన్​, బ్లాక్ విత్​ గ్రే కలర్​ ​అనే నాలుగు కలర్​ వేరియంట్లలో లభిస్తుంది.

హోండా సీడీ110 డ్రీమ్ డీలక్స్ బైక్ ధర
Honda CD110 Dream Deluxe Price :హోండా కంపెనీ ఈ లేటెస్ట్​ బైక్ ధరను రూ.73,400 (ఎక్స్​-షోరూం ధర)గా నిర్ణయించింది.

Last Updated : Aug 11, 2023, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details