Honda New Model Launch 2023 :ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్స్ మరో సరికొత్త మోడల్ 2023 Honda CB300F బైక్‌ను భారత విపణిలో విడుదల చేసింది. హోండా డీలక్స్ ప్రో వేరియెంట్ల తరహాలోనే దీన్ని కూడా తీర్చిదిద్దారు. స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్స్ వేరియంట్స్‌లో ఈ మోడల్‌ను తీసుకువచ్చారు. ఈ నయా బైక్ బుకింగ్స్ సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభమయ్యాయి.
స్పెక్స్ అండ్ ఫీచర్స్!
Honda CB300F Specs And Features :
- స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్(HSVCS)
- డ్యుయెల్ డిస్క్ బ్రేక్స్ (276mm ఫ్రంట్ & 220mm రియర్)
- 5 లెవెల్స్ కస్టమైజెబుల్ బ్రైట్‌నెస్‌తో డిజిటల్ ఇన్‌స్ట్రూమెంటల్ ప్యానెల్
- అసిస్ట్ స్లిప్పర్ క్లచ్
- 6 స్పీడ్ గేర్‌బాక్స్
- LED లైటింగ్ సిస్టమ్
- డ్యూయెల్ ఛానల్ ABS
- 5 స్టెప్ అడ్జెస్టెబుల్ రియర్ మోనో షాక్స్
- సస్పెన్షెన్ కోసం గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్
- స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్యాకోమీటర్, ఫ్యూయెల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్స్, గియర్ పోజిషన్ ఇండికేటర్, క్లాక్.
ఇంజిన్ స్పెసిఫికేషన్స్
Honda CB300F Engine Specs :ఈ లేటెస్ట్ బైక్‌లో BS6 OBD II కంప్లైయంట్ 293cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజీన్‌ను అమర్చారు. ఇది 24 bhp పవర్, 25.6 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
హోండా సీబీ300ఎఫ్ ధర
Honda CB300F Price : హోండా సీబీ300ఎఫ్ బైక్ ధర రూ.1.70 లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది.
KTM నుంచి మరొ రెండు కొత్త Duke మోడల్స్!
KTM New Bike Deals :ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం.. రెండు ప్రీమియం బైక్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 2024 కేటీఎం జెన్-3 డ్యూక్ 390, డ్యూక్ 250 పేర్లతో ఈ సరికొత్త మోడళ్లను లాంఛ్ చేసింది. 2024 Gen-3 KTM Duke సిరీస్‌కు అప్‌డేటెట్ వెర్షెన్‌గా పలు కీలక మార్పులతో వీటిని తీసుకువచ్చారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్‌ను ఈ రెండు మోడల్స్‌లో చూడవచ్చు. కాగా, వీటికి సంబంధించిన బుకింగ్ ధరలు రూ.4,499 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మోడల్స్‌లో అత్యాధునిక టెక్నాలజీని వాడారు. సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్స్‌తో తక్కువ బరువు(లైట్‌వెయిట్)తో వస్తున్న వీటి స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
స్పెక్స్ అండ్ ఫీచర్స్!
KTM Duke Bike Features :
- స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
- రైడ్ బై వైర్ టెక్నాలజీ
- టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్
- టర్న్ బై టర్న్ నావిగేషన్
- 5 అంగుళాల TFT డిస్ప్లే
- సూపర్మోటో ABS సిస్టమ్
- ఆఫ్సెట్ రియర్ మోనో-షాక్
- LC4c సింగిల్-సిలిండర్ ఇంజీన్స్
- WP APEX అడ్జెస్టెబుల్ సస్పెన్షన్
- కంప్రెషన్ అడ్జెస్టెబుల్ ఫోర్క్స్ అప్‌ఫ్రంట్
- ఆప్టిమైజ్డ్ సిలిండర్ హెడ్స్, గియర్బాక్సెస్
- 10-క్లిక్ ప్రీలోడ్ అడ్జెస్టెబుల్ రియర్ మోనో-షాక్
- భద్రత కోసం మోటార్‌సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ (MTC)
ఇంజీన్ వివరాలు!
- KTM 390 Duke - 399-cc ఇంజీన్
- KTM 250 Duke - 250-cc ఇంజీన్
కలర్ ఆప్షన్స్!
- అట్లాంటిక్ బ్లూ
- ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మెటాలిక్
Duke ప్రైజ్ ట్యాగ్!
- Gen-3 Duke 390 ధర - రూ.3.10 లక్షలు
- Gen-3 Duke 250 ధర - రూ.2.39 లక్షలు