Honda Elevate And Citroen C3 Aircross Cars : భారత మార్కెట్లలో మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు మంచి ఆదరణ ఉంది. దీన్ని ఆధారంగా చేసుకునే.. సరికొత్త మోడల్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి కార్ల కంపెనీలు. తాజాగా హోండా, సిట్రోయెన్ కంపెనీలు తమ కొత్త మోడల్ ఎలివేట్, C3 ఎయిర్‌క్రాస్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. కానున్న కొద్ది రోజుల్లోనే ఈ కార్లు భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లకు.. ఈ కొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీలు పోటీగా నిలవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా భారత వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరింత ఆకర్షణీయంగా ఈ రెండు ఎస్‌యూవీలను తయారు చేశాయి హోండా, సిట్రోయెన్ కంపెనీలు. ఈ కార్ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Honda Elevate SUV 2023 India : హోండా ఎలివేట్..
హోండా ఎలివేట్‌ను 2023 సెప్టెంబర్‌లో భారత కస్టమర్లకు పరిచయం చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. జులై నెలలోనే ఈ కార్ల బుకింగ్‌లను కూడా హోండా ప్రారంభించింది. మంచి ఆకర్షణీయ ఆకృతిలో ఈ కారును కంపెనీ రూపొందించింది.
Honda Elevate SUV Features And Specifications : హోండా ఎలివేట్ ఫీచర్లు..
- 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యంతో వస్తున్న ఈ కారు.. 119 బీఎచ్పీ గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
- 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, సీవీటీ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ఇందులో అమర్చారు.
- కారు లోపలి భాగంలో.. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.
- అదే విధంగా ADAS, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
- బయటవైపు.. మంచి డిజైన్‌తో పాటు ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, LED టెయిల్‌లైట్స్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు అమర్చి ఉన్నాయి.
Citroen C3 Aircross Features : సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్
- ఈ కారును 2023 ఆగస్టులో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. సరికొత్త డిజైన్‌తో C3 ఎయిర్‌క్రాస్‌ను మరింత ఆకర్షణీయంగా తయారు చేసింది సంస్థ.
- కారు లోపలి భాగంలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. మూడో వరుస సీట్లను తీసివేసే ప్రత్యేక సౌకర్యం కూడా ఈ కారులో ఉంది.
- 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ఇందులో అమర్చారు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫ్రంట్ గ్రిల్, స్ల్పిట్ హెడ్‌లైట్ సెటప్.. కారు బయటి వైపు ఉన్నాయి.
సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్యూవీ సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్యూవీ