తెలంగాణ

telangana

ETV Bharat / business

హోండా, సిట్రోయెన్​ దీపావళి ఆఫర్స్​ - ఆ కారుపై ఏకంగా రూ.1,00,000 డిస్కౌంట్! - హోండా కార్ డిస్కౌంట్స్​ 2023

Honda Car Diwali Offers 2023 In Telugu : దీపావళికి కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్​. హోండా, సిట్రోయెన్ కంపెనీలు తమ లేటెస్ట్ మోడల్ కార్లపై భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Citroen C3 Aircross Offers in November 2023
Honda Car Diwali Offers 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 2:04 PM IST

Honda Car Diwali Offers 2023 : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు హోండా, సిట్రోయెన్​లు ఈ దీపావళి సందర్భంగా తమ లేటెస్ట్ మోడల్ కార్లపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హోండా దీపావళి కార్ డిస్కౌంట్స్​!
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా ఇండియా Amaze, City, Elevate కార్లపై దీపావళి ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించింది.

Honda Amaze Discount Offers in November 2023 : హోండా కంపెనీ.. అమేజ్ కారుపై రూ.67,000 వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎలా అంటే..

  • క్యాష్ డిస్కౌంట్ (SMI) - రూ.25,000
  • క్యాష్ డిస్కౌంట్ (Other Variants) - రూ.15,000
  • ఎక్స్ఛేంజ్​ బోనస్​ - రూ.15,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.3,000
  • లాయల్టీ బెనిఫిట్స్ - రూ.4,000
  • వీటితో పాటు కొన్ని ఎంపిక చేసిన ప్రొఫైల్స్​పై రూ.20,000 వరకు స్పెషల్​ కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.
    హోండా అమేజ్​

Honda City Discount Offers in November 2023 :హోండా కంపెనీ.. హోండా సిటీ కారుపై ఏకంగా రూ.88,000 వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎలా అంటే..

  • క్యాష్ డిస్కౌంట్ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్​ బోనస్​ - రూ.15,000
  • హోండా టు హోండాఎక్స్ఛేంచ్​ బోనస్​ - రూ.6,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.5,000
  • లాయల్టీ బెనిఫిట్స్ - రూ.4,000
  • వీటితో పాటు కొన్ని ఎంపిక చేసిన ప్రొఫైల్స్​పై రూ.20,000 వరకు స్పెషల్​ కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.
  • City Vx, Zx మోడల్స్​పై 5th ఇయర్స్ ఎక్స్​టెండెడ్ వారెంటీ కూడా ఇస్తున్నారు.
    హోండా సిటీ

Honda City eHEV Hybrid Offers :హోండా కంపెనీ ఈ దీపావళి పండుగ సందర్భంగా Honda City eHEV Hybrid కారుపై ఏకంగా రూ.1,00,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.

హోండా సిటీ ఈహెచ్​ఈవీ హైబ్రిడ్​

Honda Elevate Offers :హోండా కంపెనీ ఎలివేట్​ కారుపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్ అందించడం లేదు.

హోండా ఎలివేట్​

Citroen C3 Aircross Offers : ఫ్రాన్స్​కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సిట్రోయెన్​.. ఈ దీపావళి పండుగ సందర్భంగా Citroen C3 Aircross కారుపై భారీ ఆఫర్స్ అండ్​ డిస్కౌంట్స్​​ ప్రకటించింది.

Citroen C3 Aircross Price :మార్కెట్​లో సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్ కారు ధర రూ.9.99 లక్షల నుంచి రూ.12.34 లక్షలు (ఎక్స్​షోరూం) వరకు ఉంటుంది. అయితే ఈ దీపావళికి ఈ సిట్రోయెన్ మిడ్​ సైజ్​ ఎస్​యూవీ కారును కొనుగోలు చేసినవారికి భారీ తగ్గింపు ధరతో దీనిని అందిస్తున్నారు.

ముఖ్యంగా సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్ కొనుగోలు చేసినవారికి నేరుగా రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తారు. అలాగే రూ.25,000 విలువైన 60,000కి.మీ, 5 ఇయర్స్ ఎక్స్​టెండెడ్​ వారెంటీ కల్పిస్తారు. 50,000 కి.మీ లేదా 5 సంవత్సరాలకు రూ.45,000 విలువైన యాన్యువల్ సర్వీస్​ అండ్​ మెయింటెనెన్స్ ప్యాకేజీని అందిస్తారు. మొత్తంగా చూసుకుంటే.. ఈ పండుగ సీజన్​లో సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ కొన్నవాళ్లకు దాదాపు రూ.90,000 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.

సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్

Citroen C3 Aircross Features :ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్​ ఈ సెప్టెంబర్​ నెలలో C3 Aircross కారును లాంఛ్ చేసింది. ఇది ప్రస్తుతం.. యూ, ప్లస్​, మ్యాక్స్​ అనే మూడు ఆప్షన్లలో.. 5 సీటర్​, 5+2 సీటర్​ వేరియంట్లలో లభిస్తుంది.

Citroen C3 Aircross Engine Details : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​లో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ను అమర్చారు. 5500 rpm వద్ద 110 PS పవర్​, 1750 rpm వద్ద 190 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. దీని ప్యూయెల్ ఎఫీషియన్సీ లీటర్​కు 18.5 కి.మీ అని కంపెనీ చెబుతోంది.

దీపావళి ఆఫర్ - హీరో బైక్‌, స్కూటీలపై భారీ తగ్గింపు!

స్టన్నింగ్​ ఫీచర్స్​తో నవంబర్​లో విడుదల కానున్న సూపర్​ కార్స్​ & బైక్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details