తెలంగాణ

telangana

ETV Bharat / business

Honda Activa Limited Edition Scooter Launch 2023: హోండా నుంచి సరికొత్త స్కూటీ.. అదిరిపోయే ఫీచర్స్! - తక్కువ ధరలో హోండా నుంచి నయా స్కూటీ

Honda Activa Limited Edition Scooter 2023 : టూ వీలర్ రంగంలో.. విపరీతమైన పోటీ నెలకొని ఉంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే.. ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా మార్కెట్​లోకి సరికొత్త వెర్షన్​తో నయా స్కూటర్​ను విడుదల చేసింది. మరి, దాని స్పెషాలిటీ ఏంటో చూడండి.

Honda Edition Scooter
Honda Activa Limited Edition Scooter Launch

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 2:46 PM IST

Honda Launches Activa Limited Edition Scooter :ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. తాజాగా హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(HMSI) కొత్త స్కూటర్​ను మార్కెట్‌లోకి లాంఛ్ చేసింది. హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్‌ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్‌లో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చింది. ఇంతకీ దీని ధర ఎంత? బెస్ట్ ఫీచర్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Honda Activa Limited Edition Scooter 2023 Price List :ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా(Honda)తీసుకొచ్చిన ఈ కొత్త వెర్షన్ యాక్టివా లిమిటెడ్ ఎడిషన్‌ స్కూటర్​లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. DLX, Smart అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ DLX వేరియంట్ ధర రూ. 80,734 (ఎక్స్​షోరూం దిల్లీ) కాగా.. Smart వేరియంట్ ధర రూ. 82,734 (ఎక్స్​ షోరూం దిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ రెండు ఆకర్షణీయమైన మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ కలర్​లలో మార్కెట్​లోకి విడుదల అయింది. పదేళ్ల వారంటీతో ఈ నయా స్కూటర్(Activa) మార్కెట్లోకి వస్తోంది.

Ola S1 Air Sale : ఓలా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్​ స్కూటర్​.. వారికి రూ.10 వేల వరకు డిస్కౌంట్​!

హోండా యాక్టివా ఫీచర్స్ :

Honda Activa Limited Edition Scooter Features :

ఇది పరిమిత కాలానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.

హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్(Honda Activa Limited Edition) మెరుగైన డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్స్‌తో వస్తుంది.

HMSI మొదటిసారిగా ఉత్పత్తిపై, బాడీ ప్యానెల్‌పై స్ట్రైకింగ్ స్ట్రైప్స్‌తోపాటు Activa 3D చిహ్నం ప్రీమియం బ్లాక్ క్రోమ్ గార్నిష్‌ను, వెనుక గ్రాబ్ రైల్ కూడా బాడీ కలర్ డార్క్ ఫినిషింగ్​తో రూపొందించింది.

DLX వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్​తో పాటు టాప్-స్పెక్ వేరియంట్​లో స్మార్ట్ కీని కూడా ఇది కలిగి ఉంది.

యాక్టివా లిమిటెడ్ ఎడిషన్‌ ఫీచర్స్ :

ఇందులో 109.51cc సింగిల్-సిలిండర్, BSVI OBD2 కంప్లైంట్ PGM-FI ఇంజన్ 5.77 kW పవర్​ ఉన్నాయి.

7.7Bహార్స్‌పవర్, 8.90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా కంపెనీ దీనిపై అందిస్తున్న 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీని(3 సంవత్సరాల ప్రామాణిక + 7 సంవత్సరాల ఐచ్ఛికం) కూడా అందిస్తోంది.

Scooters under 1 lakh : బెస్ట్​ స్కూటీస్​.. స్పెక్స్​, ఫీచర్స్ అదుర్స్​.. ధర రూ.లక్ష లోపే!

BGauss C12i Max Electric Scooter 135km Mileage : వామ్మో.. మైలేజ్ 130 కిలోమీటర్లట​..! ఈ స్కూటర్ చూశారా..?

Honda Dio launch 2023 : హోండా డియో లాంఛ్​.. ఫీచర్స్​ అదుర్స్​.. ధర ఎంతంటే?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details