Home Loan Step Up EMI : ఒకప్పుడు మనం ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలంటే.. దానికి సరిపడా డబ్బు మన దగ్గర ఉండాల్సి వచ్చేది. లేదంటే అది సాధ్యమయ్యేది కాదు. కానీ నేడు ఈఎంఐ సౌకర్యం ఉండడం వల్ల ఖరీదైన వస్తువుల్ని సైతం పూర్తిగా డబ్బు చెల్లించకుండానే ఇంటికి తీసుకురాగలుగుతున్నాం. దీని కోసం నెల నెలా కొంత సొమ్మును ఈఎంఐ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. కానీ మీరు స్టెప్-అప్ ఈఎంఐ గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ఇదేంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Step Up Home Loan Repayment : స్టెప్-అప్ ఈఎంఐ అనేది ఒక లోన్ రీపేమెంట్ ఆప్షన్. ఈ పద్ధతి ద్వారా రుణం తీసుకున్న.. మొదట్లో ఈఎంఐ వాయిదా చెల్లింపు సొమ్ము తక్కువగా ఉంటుంది. కాల వ్యవధి పెరిగే కొలది.. క్రమంగా ఈఎంఐ వాయిదా చెల్లింపు సొమ్ము పెరుగుతుంది. స్టెప్-అప్ EMI ప్రాథమిక సూత్రం ఏమిటంటే.. రుణ గ్రహీత ఆదాయానికి అనుగుణంగా, వారు ఆశించిన స్థాయిలో రుణ చెల్లింపు షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా రుణగ్రహీత.. మెరుగైన ఆర్థిక నిర్వహణ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ స్టెప్-అప్ ఈఎంఐను ఎక్కువగా హోమ్ లోన్ సెగ్మెంట్ (ఎక్కువ రీపేమెంట్ వ్యవధి) కింద అందిస్తారు.
Step Up Loan Calculator : ఈ స్టెప్-అప్ ఈఎంఐ ప్లాన్‌లో, రుణ గ్రహీత ప్రారంభ సంవత్సరాల్లో ప్రధానంగా వడ్డీని మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ప్రధాన భాగం అంటే రుణమొత్తం, వడ్డీలు కలిపి లోన్ వ్యవధి చివరి భాగంలో అధిక నిష్పత్తిలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ స్టెప్-అప్ ఈఎంఐ విషయాన్ని రుణం ఆమోదించే సమయంలోనే బ్యాంకులు నిర్ణయిస్తాయి.
వాస్తవానికి ద్రవ్యోల్బణం, రియల్ ఎస్టేట్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడం వల్ల చాలా మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే.. అలాంటి వారికి ఈ స్టెప్-అప్ EMI స్కీమ్ మంచి పరిష్కారంగా ఉంటుంది. లోన్ తీసుకున్న ప్రారంభంలో తక్కువ EMI మాత్రమే ఉంటుంది. కనుక వాళ్లపై ఒకేసారి పెద్ద భారం పడకుండా ఉంటుంది.
స్టెప్-అప్ ఈఎంఐ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు!
Home Loan Step Up EMI Benefits :
ప్లాన్ చేసుకోవడానికి వీలుగా :సాధారణంగారుణగ్రహీతల ఆదాయం కాలక్రమేణా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వారి రీపేమెంట్ సామర్థ్యం కూడా మెరుగవుతుంది. ఫలితంగా వారు.. తమ ఆర్థిక అంశాలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.
రుణ అర్హతను మెరుగు పరుస్తుంది :బ్యాంకులుసాధారణంగా కాలక్రమంలో రుణగ్రహీత ఆదాయంలో ఆశించిన వృద్ధి ఉంటుందనే ఉద్దేశంతో రుణాలు మంజూరు చేస్తాయి. కనుక చిన్న వయస్సులో రుణాలు తీసుకునేవారు.. అధిక మొత్తం రుణానికి అర్హులవుతారు. దీని వల్ల తమకు నచ్చిన ప్రదేశంలో, నచ్చినట్టుగా ఇల్లు నిర్మించుకోవడానికి వీలవుతుంది. సాధారణ హోమ్ లోన్ ఈఎంఐలో ఇలాంటి అవకాశం ఉండదు.
కెరీర్ ప్రారంభంలోనే ఇల్లు కొనుగోలు :ఈ స్టెప్-అప్ ఈఎంఐ ప్లాన్.. యువతకు బాగా ఉపయోగపడుతుంది. యువత తమ కెరీర్ ప్రారంభంలో తక్కువ జీతం ఉన్నప్పటికీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రుణ చెల్లింపు EMIని భరించేందుకు వారి ఆదాయం బాగా పెరిగి, ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకునే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
పన్ను ప్రయోజనాలు
Home Loan Tax Benefit :మన దేశంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, హోంలోన్ + వడ్డీపై రుణగ్రహీతలు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు.
రిస్క్ కూడా ఉంది!
Step Up EMI risk : స్టెప్-అప్ ఈఎంఐ పథకం వల్ల లాభాలు మాత్రమే కాదు.. చాలా రిస్కులు కూడా ఉంటాయి. అత్యంత ముఖ్యమైన ప్రమాదం ఏమిటంటే.. EMI పెరుగుదల, ఎల్లప్పుడూ ఆదాయం పెరుగుదలకు అనుగుణంగా ఉండదు. రుణగ్రహీత ఆదాయం ఆశించిన విధంగా పెరగకపోతే, తరువాతి సంవత్సరాల్లో అధిక EMIలను చెల్లించలేక, వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. రుణ వాయిదాల చెల్లింపు విషయానికి వస్తే.. ప్రారంభంలో ఈఎంఐ తక్కువగా ఉంటుంది కానీ, కాలక్రమేణా అది బాగా పెరుగుతుంది. ఇది సాధారణ ఈఎంఐతో పోలిస్తే.. ఎక్కువే ఉండే అవకాశముంది. కనుక ఈ పథకాన్ని ఎంచుకునే ముందు ప్రస్తుత ఆర్థిక స్థితి, భవిష్యత్తు ఆదాయం, వృద్ధి, ఇతర ఆర్థిక అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అంతే కాకుండా స్టెప్-అప్ EMI ప్లాన్‌ను ఎంచుకునే ముందు తప్పకుండా ఆర్థిక నిపుణుల సలహాను తీసుకోవడం చాలా మంచిది.