తెలంగాణ

telangana

ETV Bharat / business

అదానీకి రూ.8లక్షల కోట్లు లాస్.. రంగంలోకి ఆర్​బీఐ! - గౌతమ్ అదానీ లేటెస్ట్ న్యూస్

హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్‌ సంస్థలు రూ.8 లక్షల కోట్లకుపైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సహా ఆ గ్రూప్‌నకు చెందిన స్టాక్స్‌ భారీగా పతనమయ్యాయి. మరోవైపు.. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌లో ఆ గ్రూప్‌ షేర్ల పతనంతో ఆర్​బీఐ రంగంలోకి దిగినట్లు తెలిసింది.

adani shares fall today
గౌతమ్ అదానీ

By

Published : Feb 2, 2023, 4:52 PM IST

అదానీ గ్రూప్‌ సంస్థల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ వెలువరించిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఆ నివేదికతో అదానీ గ్రూప్‌ సంస్థల వాటాలు స్టాక్‌ మార్కెట్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి చవిచూస్తున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తరఫున తీసుకొచ్చిన ఎఫ్​పీఓను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ అధిపతి గౌతమ్‌ అదానీ.. తమ సంస్థ మూలాలు బలంగానే ఉన్నాయని స్వయంగా ప్రకటించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ సహా దాదాపు అన్ని కంపెనీలు గురువారం భారీ నష్టాలు చవిచూశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏకంగా 26శాతానికిపైగా పతనమైంది. ఎఫ్​పీఓను వెనక్కు తీసుకోవడం.. ఈ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించింది. అదానీ విల్‌మార్‌, అదానీ టోటల్‌ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా అదానీ గ్రూప్‌ సంస్థల సంపద రూ.8లక్షల కోట్లకుపైగా ఆవిరైనట్లు తెలుస్తోంది.

అదానీ గ్రూప్‌ కంపెనీలకు చెందిన సెక్యూరిటీస్‌పై తమ క్లయింట్లకు ఎలాంటి మార్జిన్‌ రుణాలు ఇవ్వకూడదని సిటీ గ్రూప్‌నకు చెందిన వెల్త్‌ యూనిట్‌ నిర్ణయించినట్లు తెలిసింది. క్రెడిట్‌ సూయిజ్‌ ఏజీ సైతం అదానీ గ్రూప్‌ బాండ్లపై రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. బాండ్లకు విలువను జీరోగా పేర్కొంది. అటు అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌లో ఆ గ్రూప్‌ షేర్ల పతనం కొనసాగుతున్న వేళ.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం రంగ ప్రవేశం చేసినట్లు తెలిసింది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు.. ఏఏ బ్యాంకులు ఎంత రుణం ఇచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే, ఆర్‌బీఐ మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

స్టాక్ మార్కెట్లో ఇలా..
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ గురువారం 224 పాయింట్లు లాభపడి 59,932 వద్ద నిలిచింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 6 పాయింట్లు దిగజారి.. 17,610 వద్ద స్థిరపడింది. ఐటీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్​, ఇన్ఫోసిస్​, విప్రో , టీసీఎస్​, ఐసీఐసీఐ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్​, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాన్ని చవిచూశాయి.

ABOUT THE AUTHOR

...view details