తెలంగాణ

telangana

ETV Bharat / business

హెల్త్‌ ఇన్సూరెన్స్ రీయింబర్స్‌మెంట్‌ ఎలా క్లెయిం చేసుకోవాలో మీకు తెలుసా ? - claim health insurance

Health Insurance Reimbursement Process : హెల్త్‌ ఇన్సూరెన్స్ కలిగిన వారు సాధారణంగా కంపెనీ నెట్‌వర్క్ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటారు. అప్పుడు పేమెంట్ క్యాష్‌లెస్‌గా అవుతుంది. ఒకవేళ నెట్‌వర్క్‌ లేని ఇతర ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటే ముందుగానే మనం డబ్బులను చెల్లించి తరవాత క్లెయిం చేసుకోవాల్సి ఉంటుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్ రీయింబర్స్‌మెంట్‌ను ఎలా క్లెయిం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Insurance Reimbursement Process
Health Insurance Reimbursement Process

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 5:13 PM IST

Health Insurance Reimbursement Process : మన దేశంలో కొవిడ్‌ తరవాత చాలా మందిలో ఆరోగ్య బీమా గురించి అవగాహన పెరిగింది. ప్రస్తుతం వైద్య ఖర్చులు ద్రవ్యోల్బణ కంటే రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి. ఒకప్పటితో పోలిస్తే పనిచేసే ఆఫీసు నుంచి గానీ సొంతంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌పాలసీ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు నెట్‌వర్క్‌ ఆసుపత్రులను కలిగి ఉంటాయి. మనం అందులో క్యాష్‌లెస్‌ చికిత్స పొందొచ్చు. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల వల్ల నెట్‌వర్క్‌లో లేని హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకోవడం తప్పకపోవచ్చు. అలాంటప్పుడు ముందుగానే బిల్లులను సొంతంగా చెల్లించి, తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వద్ద క్లెయిం చేసుకోవాలి.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో రీయింబర్స్‌మెంట్‌ ఒకటి. ఈ రీయింబర్స్‌మెంట్‌లో కొంత ఫైలింగ్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రీయింబర్స్‌మెంట్‌ క్లెయిం ప్రక్రియను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లెయిం :
క్లెయింలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయి. హాస్పిటల్‌లో చేరేటప్పుడు ఇన్సూరెన్స్‌ కంపెనీకి ముందస్తు సమాచారం ఇవ్వడం మర్చిపోకూడదు. ఆసుపత్రిలో చేరిన 24 గంటలలోపు సమాచారం అందించడం మంచిది. కంపెనీ కస్టమర్‌ కేర్‌ హెల్ప్‌ లైన్‌కు లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం పంపొచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్‌ కంపెనీ మీకు క్లెయిం ఇంటిమేషన్‌ నంబర్‌ను ఇస్తుంది. క్లెయిం ప్రక్రియ ముగిసే వరకు ఈ నంబర్‌ ముఖ్యమైన రిఫరెన్స్‌లాగా ఉపయోగపడుతుంది.

ఒరిజనల్ డాక్యుమెంట్స్‌ :
హెల్త్ ఇన్సూరెన్స్‌ను క్లెయిం చేసేటప్పుడు కంపెనీ అందించిన రీయింబర్స్‌మెంట్‌ క్లెయిం ఫారంను ఫిల్‌ చేయాలి. ఈ ఫారంలో వ్యక్తిగత వివరాలు, పాలసీ సమాచారం, చికిత్స వివరాలు, క్లెయిం చేసే నగదు మొత్తం వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. ముఖ్యంగా ఇన్సూరెన్స్‌ పరిధిలో ఉండి చికిత్స తీసుకున్న పేషెంట్ వైద్య బిల్లులు (డాక్టర్‌ ఫీజులు, ఆసుపత్రి ఛార్జీలు), ఫార్మసీ బిల్లులు, చెల్లింపుల రసీదులు, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌లు, రిపోర్ట్‌లు, ముఖ్యంగా డిశ్చార్జి సమ్మరీ, చికిత్సకు సంబంధించిన అన్ని సంబంధిత పత్రాలు (ఒరిజనల్స్‌) రీయింబర్స్‌మెంట్‌ క్లెయిం ఫారంతో పాటు నేరుగా హెల్త్ ఇన్సూరెన్స్‌ కంపెనీకి అందించాలి.

క్లెయిం అప్లికేషన్‌ :
హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా క్లెయిం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ క్లెయిం, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (TPA) ద్వారా ప్రాసెస్‌ చేస్తే.. పాలసీదారుడు టీపీఏ అందించిన క్లెయిం సెటిల్‌మెంట్‌ ఫారంను ఫిల్ చేయాలి. దురదృష్టవశాత్తు ఒకవేళ పేషెంట్‌ చికిత్స పొందుతూ చనిపోతే డెత్‌ సమ్మరీ, చట్టపరమైన వారసులు ఇచ్చే సర్టిఫికెట్‌ వంటి ఇతర పత్రాలు అవసరం కావచ్చు. రీయింబర్స్‌మెంట్‌ క్లెయిం చేసేముందు వైద్య చికిత్సకు సంబంధించిన అన్ని ఒరిజినల్స్ కాపీలను జిరాక్స్‌ చేసుకోండి. ఒకవేళ ఏదైనా బిల్లులు చెల్లించకపోతే ఉపయోగపడుతుంది.

క్రెడిట్‌ కార్డు బిల్లు భారంగా మారిందా? ఈ ఫెసిలిటీతో అన్నీ క్లియర్​!

క్లెయిం ప్రాసెస్‌, ఆమోదం:
క్లెయింకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్‌ను సమర్పించిన తరవాత కంపెనీ, అన్ని అంశాలను చెక్ చేస్తుంది. తరవాత క్లెయిం ప్రాసెస్ కావడానికి సాధారణంగా 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. కంపెనీని బట్టి సమయం మారుతుంది. క్లెయిం ఆమోదం పొందితే కంపెనీ పాలసీదారుడికి అర్హత కలిగిన ఖర్చులను బ్యాంకు నెఫ్ట్‌/చెక్‌ ద్వారా తిరిగి చెల్లిస్తుంది.

క్లెయిం రిజెక్ట్‌ చేస్తుందా ?
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కొన్ని కారణాల వల్ల మీ క్లెయింను రిజెక్ట్‌ చేస్తుంది. పేషెంట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్ పరిధిలోకి రాని అనారోగ్యం/వైద్య సంఘటనకు సంబంధించి చికిత్స తీసుకున్నప్పుడు, చికిత్సకు సంబంధించి వాస్తవాలు దాచినప్పుడు, పాలసీ జాబితాలో పేర్కొన్న ముందస్తు వ్యాధుల చికిత్స పొందినప్పుడు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్‌ చేసే అవకాశం ఉంది.

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

మీ ఆదాయపన్ను మరింత తగ్గించుకోవాలా? - ఇలా ట్యాక్స్ చెల్లిస్తే భారీ మినహాయింపు మీ సొంతం!

ABOUT THE AUTHOR

...view details