HDFC and HDFC Bank Merger Impact : హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీన ప్రక్రియ జులై 1న పూర్తి అయ్యింది. దీనితో సుమారు రూ.18 లక్షల కోట్ల విలువైన భారతీయ ప్రైవేట్ బ్యాంకుగా నిలిచింది. విలీనం అనంతరం 8,300 బ్యాంకు శాఖలు, 12 కోట్ల ఖాతాదారులు, 1.77 లక్షల మంది ఉద్యోగులతో దేశంలోనే నంబర్ 1 బ్యాంకుగా అవతరించింది. మరి ఇలాంటి సమయంలో మోర్టగేజ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్‌లోన్ తీసుకున్నవారి పరిస్థితి ఏమిటి? వడ్డీ రేట్లలో ఏమైనా మార్పులు ఉంటాయా?
హోమ్‌లోన్ కస్టమర్ల పరిస్థితి ఏమిటి?
- హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లో హామ్లోన్ తీసుకున్న వారి ఖాతాలు.. ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు బదిలీ అవుతాయి. కానీ లోన్ అగ్రిమెంట్, లోన్ నంబర్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
- హెచ్డీఎఫ్సీ ఖాతాదారుల హోమ్‌లోన్ వడ్డీ రేట్లు ఇంతకు ముందు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)కు అనుగుణంగా ఉండేవి. ఇకపై ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)కు అనుసంధానం కానున్నాయి. ముఖ్యంగా ఇవి ఫ్లోటింగ్ వడ్డీ రేట్లకు వర్తిస్తాయి.
- HDFC Home Loan Interest Rate : ప్రస్తుతానికి గృహ రుణాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ.. భవిష్యత్‌లో 'ఈబీఎల్ఆర్'కు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు.
- ఇకపై హోమ్‌లోన్ ప్రీ పేమెంట్‌కు సంబంధించి.. సంప్రదింపుల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకు శాఖలను సందర్శించవచ్చు. అదే విధంగా customer.service@hdfc.com కు కూడా మెయిల్ చేయవచ్చు.
- హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉన్నవారు.. హెచ్డీఎఫ్సీ పోర్టల్‌లో లాగిన్ కావచ్చు. అక్కడే తమ గృహ రుణాల వివరాలను తెలుసుకోవచ్చు.
- హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అకౌంట్ లేనివారు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హోమ్‌లోన్ సెక్షన్లో పాత లాగిన్ వివరాలతో సైన్ఇన్ చేయవచ్చు.
- ఇప్పుడు మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెబ్సైట్ నుంచి .. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ హోమ్‌లోన్‌కు సంబంధించిన ఇంట్రెస్ట్ సర్టిఫికేట్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే customer.service@hdfc.com నుంచి కూడా పొందవచ్చు. లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చు.