తెలంగాణ

telangana

ETV Bharat / business

HDFC Merger : భారత్​లో నంబర్ 1.. వరల్డ్​లో టాప్​ 4 బ్యాంకుగా హెచ్​డీఎఫ్​సీ!

HDFC Merger : హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​ విలీనం తరువాత మార్కెట్​ వాల్యూ ప్రకారం దేశంలో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు. అలాగే ప్రపంచంలోనే అత్యంత విలువైన 4వ బ్యాంకుగా కూడా నిలువనుంది. జులై 13న హెచ్​డీఎఫ్​సీ రికార్డ్​ తేదీగా ఉంటుంది. పూర్తి వివరాలు చూద్దాం.

HDFC Merger
HDFC and HDFC BANK Merger

By

Published : Jul 1, 2023, 3:03 PM IST

HDFC AND HDFC BANK MERGER : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు త్వరలో ప్రపంచ బ్యాంకుల సరసన నిలువనుంది. ముఖ్యంగా హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​ విలీనం తరువాత విలువపరంగా దేశంలో అతిపెద్ద ప్రైవేట్​ బ్యాంకుగా అవతరించనుంది.

దేశీయ ప్రైవేట్​ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​.. మోర్టగేజ్​ లెండర్​ హెచ్​డీఎఫ్​సీ విలీన ప్రక్రియ జులై 1న పూర్తికానుంది. జులై 13న హెచ్​డీఎఫ్​సీ రికార్డ్​ తేదీగా ఉంటుంది.

నంబర్​ వన్​ స్థానంలో..
HDFC Bank net worth : ఒకసారి హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు విలీనం పూర్తి అయితే వీటి సంయుక్త విలువ.. దేశీయ ప్రైవేట్​ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్​ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్​ బ్యాంకుల సంయుక్త విలువ కంటే చాలా ఎక్కువ అవుతుంది. అంతే కాదు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల సంయుక్త విలువ కంటే కూడా చాలా అధికంగా ఉంటుంది.

స్టాక్​ మార్కెట్​లో హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​ ట్రేడింగ్​కు శనివారమే (జులై 1) చివరి రోజు. హెచ్​డీఎఫ్​సీ మార్కెట్​ విలువ రూ.5.19 లక్షల కోట్లు; హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు మార్కెట్​ విలువ రూ.9.47 లక్షల కోట్లు. ఈ రెండూ కలిస్తే మొత్తంగా వీటి మార్కెట్​ విలువ రూ.14.7 లక్షల కోట్లు అవుతుంది. మరోవైపు భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటి మార్కెట్​ విలువ రూ.9.77 లక్షల కోట్లు మాత్రమే. దేశీయ ప్రైవేట్​ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్​ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకుల మొత్తం మార్కెట్​ విలువ రూ.14.3 లక్షల కోట్లు.

వరల్డ్స్​ టాప్​ 61 కంపెనీగా..
HDFC bank rank in world : హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​ మెర్జర్​ తరువాత ప్రపంచంలోని అత్యంత విలువైన టాప్​ 100 కంపెనీల్లో.. హెచ్​డీఎఫ్​సీ 61వ స్థానంలో నిలువనుంది.​ ప్రస్తుతం ఈ లిస్ట్​లో 3 ట్రిలియన్​ డాలర్ల మార్కెట్​ వాల్యూతో యాపిల్​ అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత మైక్రోసాఫ్ట్​ 2.50 ట్రిలియన్ డాలర్లు, సౌదీ ఆరాంకో 2.08 ట్రిలియన్ డాలర్ల మార్కెట్​ క్యాప్​తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

మోర్గాన్​ స్టాన్లీని దాటేసి..
త్వరలో ప్రపంచంలోని అత్యంత పెద్ద బ్యాంకుల్లో హెచ్​డీఎఫ్​సీ నాల్గన స్థానాన్ని కైవసం చేసుకోనుంది. ప్రస్తుతం జేపీ మోర్గాన్ 405 బిలియన్​ డాలర్ల మార్కెట్ వాల్యూతో ప్రపంచంలోనే అగ్రగామి బ్యాంకుగా కొనసాగుతోంది. బ్యాంక్​ ఆఫ్​ అమెరికా 223 బిలియన్ డాలర్లు, ఇండస్ట్రియల్​ అండ్​ కమర్షియల్​ బ్యాంక్ ఆఫ్​ చైనా 223 బిలియన్ డాలర్ల మార్కెట్​ విలువతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

త్వరలోనే హెచ్​ఎస్​బీసీ హోల్డింగ్స్​, బ్యాంక్​ ఆఫ్ చైనా, మోర్గాన్​ స్టాన్లీ, రాయల్​ బ్యాంక్​ ఆఫ్​ కెనడా బ్యాంకులను మార్కెట్​ వాల్యూ పరంగా హెచ్​డీఎఫ్​సీ వెనక్కు నెట్టివేయనుంది.

ఇప్పటికే హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు దాదాపుగా అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశాయి. అధికారికంగా జులై 13న విలీన ప్రక్రియ పూర్తవుతుంది.​ ఒకసారి విలీనం అయిన తరువాత హెచ్​డీఎఫ్​సీ షేర్​ హోల్డర్లు.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో 41 శాతం వరకు పొందుతారు. ముఖ్యంగా స్వాప్​ రేషియో 25:42గా ఉంటుంది. అంటే హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​కు చెందిన ప్రతి 25 షేర్లకు.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లు ఇవ్వడం జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details