C Vijayakumar HCL CEO Salary : వివిధ రంగాలతో పోలిస్తే ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు వార్షిక వేతనాలు భారీగానే ఉంటాయి. కొందరు రోజుకు వేలల్లో సంపాదిస్తారు. ఇంకొందరు రోజుకు లక్షల్లో ఆర్జించే ఉద్యోగులూ ఉన్నారు. అలా నెలకు కోట్లలో జీతం పొందుతున్న వారు కూడా మన దేశంలో ఉన్నారు. అయితే తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల సి. విజయ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం రోజుకు ఏకంగా రూ.36 లక్షల జీతం అందుకుంటున్నారు. దీంతో భారత దేశంలోని ఐటీ సంస్థలలో అత్యధిక వేతనం పొందుతున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఈయన ప్రముఖ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్‌లో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తస్తున్నారు. మొత్తంగా ఈయన వార్షిక ఆదాయం రూ.130 కోట్లు.
రోజుకు రూ.36 లక్షలు.. భారత్‌లో అత్యధిక జీతం ఈయనదే!
C Vijayakumar Salary : దేశంలో అత్యధిక జీతం సంపాదించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు రోజుకు వందల్లో సంపాదిస్తే.. మరికొందరు వేలల్లో, ఇంకొందరు లక్షల్లో సంపాదిస్తారు. విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా రోజుకు లక్షల్లో సంపాదించే ఉద్యోగులు ఉన్నారు. అయితే తమిళనాడు చెందిన ఓ వ్యక్తి మాత్రం రోజుకు ఏకంగా రూ.36 లక్షలు సంపాదిస్తున్నారు. దీంతో ఆయన దేశంలోనే రోజుకు అత్యధిక జీతం పొందుతున్న ఉద్యోగిగా నిలిచారు.
దేశంలోనే టాప్ సీఈఓగా..
Highest Paid CEO In India : హెచ్‌సీఎల్ సంస్థ వార్షిక నివేదిక ప్రకారం.. విజయ కుమార్ గత ఆర్థిక సంవత్సరం(2022)లో బేసిక్ పే కింద 2 మిలియన్ల యూఎస్ డాలర్లతో పాటు ఇతర బెనిఫిట్స్‌ను కూడా కలుపుకొని మొత్తం 4.13 మిలియన్ యూఎస్ డాలర్ల వేతనాన్ని అందుకున్నారు. అంటే సుమారు సుమారు రూ.34 కోట్లు. ఈయన 2022లో 16.52 మిలియన్ డాలర్లు అంటే రూ.131.08 కోట్లు సంపాదించారని.. ఇందులో లాంగ్ టెర్మ్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయని ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. దీంతోనే ఆయన భారతదేశంలోని ఐటీ సంస్థలలో అత్యధిక వేతనం పొందుతున్న ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నిలిచారని పేర్కొంది.
సాధారణ ఉద్యోగిగా చేరి..
HCL Technologies CEO : హెచ్‌సీఎల్ సంస్థ వ్యవస్థాపకుడు శివ్ నాడార్. ఈయన 2022లో ఈ కంపెనీ ఎండీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. అనంతరం 2022, జులై 20న విజయ్ కుమార్ ఆ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో భారతదేశపు మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ ట్రేడింగ్ నెట్‌వర్క్‌ను రూపొందించి అమలు చేసిన హెచ్‌సీఎల్ కంపెనీలోని కోర్ టీమ్‌లో 1994లో ఓ సభ్యునిగా చేరారు విజయకుమార్. కాగా, సీఈఓ కాకముందు విజయ కుమార్ కంపెనీలోని పలు కీలక హోదాల్లో కూడా పనిచేశారు. ఆయన ప్రస్తుతం యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు.