తెలంగాణ

telangana

ETV Bharat / business

Harley Davidson X 350 India Launch 2023 : దూసుకొస్తున్న హార్లీ డేవిడ్​ సన్ 350 బైక్.. నమ్మలేని ధరల్లో! - full details of Harley Davidson X 350 telugu

Harley Davidson X 350 India Launch and Price Details : యువతకు బైక్‌ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రీమియం బైకులపై ఎడగతెగని మోజు. లగ్జరీ బైక్స్​ కొనాలని ఆశపడే వారి లిస్టులో.. హార్లీ డేవిడ్సన్‌ బ్రాండ్​ కచ్చితంగా ఉంటుంది. ఈ బైక్​ కొత్త మోడల్​ను ఇండియాలో లాంఛ్ చేయబోతున్న తయారీదారులు.. ఊహించని ధరలతో మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేయండి.

Harley Davidson X 350 India Launch and Price Details Telugu
Harley Davidson X 350 India Launch 2023

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 3:28 PM IST

Harley-Davidson X 350 India Launch and Price Details Telugu: ప్రపంచ రోడ్లపై దూసుకెళ్లే.. హై ఎండ్ బైక్ లలో హార్లీ డేవిడ్సన్ ఫస్ట్​ప్లేస్​లో ఉంటుంది. విశ్వవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ఈ బ్రాండ్​ ధర కూడా అధికంగానే ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ బ్రాండ్ తక్కువ ధరే.. 6 లక్షలు! ఇక హయ్యెస్ట్ కాస్ట్ ఏకంగా 60 లక్షల దాకా ఉంది. అలాంటిది.. ఇప్పుడు అతి తక్కువ ధరతో సరికొత్త మోడల్ ను లాంఛ్ చేయబోతోంది హార్లీ డేవిడ్సన్యాజమాన్యం.

ఈ కొత్త మోడల్ పేరు.. హార్లీ డేవిడ్సన్ ఎక్స్350 (Harley-Davidson X350). ఈ మోడల్ ఇప్పటికే చైనాలో రిలీజ్​ చేశారు. ఈ డిసెంబర్​లో గా ఇండియాలో లాంఛ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ న్యూ బైక్​ మోడల్​కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

ఓలా నుంచి కొత్త ఈ-బైక్స్.. రూ.80వేల కన్నా తక్కువకే.. ఇంజిన్ బైక్​ల పని అయిపోయినట్టే!

హార్లీ డేవిడ్సన్‌ X350 స్పెసిఫికేషన్స్:

Specifications of Harley Davidson X350:గతంలో డిస్‌కంటిన్యూ చేసిన స్పోర్ట్‌ స్టార్ XR1200X ఆధారంగా హార్లీ డేవిడ్సన్‌ X350 బైక్‌ను తయారు చేశారు. ఇది సర్క్యులర్‌ హెడ్‌ ల్యాంప్‌ క్లాసిక్ లుక్‌ను అందిస్తోంది. ఇదే డిజైన్‌లో సర్క్యులర్‌ మోనోపాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తోంది. 350cc టూ-వీలర్‌లో టియర్ డ్రాప్డ్ షేప్డ్ ఇంధన ట్యాంక్ ఉంది.

హార్లీ డేవిడ్సన్‌ X350 ఫీచర్స్ :

Features of Harley Davidson X350: ఈ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్, టెయిల్ లైట్లు అమర్చినట్లు తెలుస్తోంది. ఫ్రంట్​ సైడ్​ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, బ్యాక్​సైడ్​ మోనో షాక్‌ను అందిస్తుంది. హార్లీ డేవిడ్సన్‌ మోటార్‌సైకిల్ 17-అంగుళాల ఎల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఎల్లాయ్ వీల్స్ ముందు 120/70-17 టైర్, వెనుక 160/60-17 టైర్‌తో వస్తాయి. అలాగే వీల్​ సైజ్​.. ముందు భాగం 431.8 mm, వెనుక భాగం 431.8 mm ఉంటుంది. అలాగే ఈ బైక్​ టైర్లు ట్యూబ్​లెస్ తో ఉంటాయి.

New Electric Bike In India : స్టన్నింగ్​ ఫీచర్స్​తో టోర్క్​ మోటార్స్​ ఈ-బైక్​ లాంఛ్​.. ధర ఎంతంటే?

హార్లీ డేవిడ్సన్‌ X350 సామర్థ్యం:

Ability ofHarley Davidson X350: హార్లీ డేవిడ్సన్‌ X350 బ్రేక్‌లో.. నాలుగు-పిస్టన్ కాలిపర్‌లతో ముందువైపు ఒకే డిస్క్.. అదే విధంగా వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో ఒకే డిస్క్‌ ఉంటుంది. 353 cc ప్యార్లల్‌-ట్విన్ ఇంజిన్‌ను ఈ బైక్‌లో పొందుపర్చారు. ఈ ఇంజన్ 36.2 బీహెచ్‌పీ, 31 ఎన్ఎమ్ మోటార్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఫ్యూయల్‌ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు. అంటే.. పుల్​ట్యాంక్​ పెట్రోల్​తో దాదాపు 300 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు. ఈ బైక్​ బరువు సుమారు 195 కిలోలు.

బైక్ కలర్స్ :
Harley Davidson X 350 Colours: చైనాలో ఈ బైక్‌ జాయ్‌ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ వంటి కలర్లలో లభిస్తోంది. ఇండియాలో కూడా ఇవే కలర్లు ఉండొచ్చని సమాచారం.

ఇండియాలో Harley Davidson X 350 లాంఛింగ్​ :Harley Davidson X350 బైక్.. ఈ డిసెంబర్​ చివరి నాటికి మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఇక దీని ప్రారంభ ధర 2.50 లక్షల మేర ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆన్‌లైన్‌లో Harley-Davidson X 350 బుక్ చేయడం ఎలా?

How To Book Harley-Davidson X 350 Online?:

  • ఈ బైక్‌ను బుక్ చేసుకోవడానికి www.harley-davidson.com అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్​ చేయాలి.
  • హార్లీ -డేవిడ్‌సన్ X 350 ఎంచుకోండి.
  • మీ రాష్ట్రం, నగరం, ఆపై సమీప Harley-Davidson డీలర్‌ను ఎంచుకోండి.
  • Harley-Davidson X 350 ప్రతినిధిని చేరుకోవడానికి మీ పూర్తి వివరాలను ఎంటర్​ చేయాలి.
  • Harley-Davidson X 350 బుకింగ్ కోసం ఆన్‌లైన్ లో డబ్బు మొత్తాన్ని చెల్లించాలి.
  • చెల్లింపు నిర్ధారణ తర్వాత.. మరిన్ని వివరాల కోసం టీమ్ హార్లే-డేవిడ్‌సన్ నుంచి కాల్ అందుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details