డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు జోరందుకున్నాయి. 2022 డిసెంబర్లో రూ.1.49 లక్షల కోట్ల వస్తుసేవల పన్ను వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇది 2021 డిసెంబర్‌తో పోలిస్తే 15శాతం ఎక్కువ అని స్పష్టం చేసింది.
15 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. డిసెంబర్లో ఎంతంటే?
2022 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2021 డిసెంబర్‌తో పోలిస్తే 15 శాతం అధికంగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
GST revenue in December 2022
వసూలైన మొత్తంలో కేంద్ర జీఎస్టీ రూ.26,771కోట్లు కాగా రూ.33,357 కోట్లు రాష్ట్ర జీఎస్టీ అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రూ.78,434 కోట్లు సమీకృత జీఎస్టీ ఉన్నట్లు తెలిపింది. సుంకం రూపంలో రూ.11,005 కోట్లు వచ్చినట్లు వివరించింది. రాష్ట్రాలకు ఆదాయాన్ని పంచిన తర్వాత సీజీఎస్టీ రూ.63,380 కోట్లు.. ఎస్జీఎస్టీ రూ.64,451కోట్లుగా తేలిందని స్పష్టం చేసింది.
Last Updated : Jan 1, 2023, 4:52 PM IST